ప్రధాని మోడీ ని లైవ్ లో పెట్టుకోవడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. జనతా కర్ఫ్యూ విధించినా టైములో అలాగే వివిధ సందర్భాల్లో మోడీ ఇచ్చిన పిలుపుకు చంద్రబాబు అనుసరిస్తూ వాటిని తనకి అండగా ఉండే మీడియాలో ప్రోజెక్ట్ చేస్తూ బీజేపీని మంచిగ చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల టైంలో మోడీని టార్గెట్ చేస్తూ బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఆ టైములో రాష్ట్రంలో చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఇదే టైములో కేంద్రంలో భారీ మెజార్టీతో మోడీ అధికారంలోకి వచ్చారు.

 

అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడిపోవడంతో రాష్ట్రంలో అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు పేరు రోజు రోజుకి తరిగిపోతున్న తరుణంలో మోడీతో భేటీ అవడానికి బాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల ఏప్రిల్ 5వ తారీకు ప్రధాని మోడీ రాత్రి 9 గంటల 9 నిమిషాలకు అందరూ దీపాలు వెలిగించాలని దేశ సమైక్యతను చాటాలని పిలుపు ఇవ్వటం జరిగింది. దీంతో ప్రధాని పిలుపు మేరకు హైదరాబాద్ లోని తన నివాసంలో చంద్రబాబు, లోకేష్, మనవడు దేవాన్ష్ లతో కలసి దీపాలను వెలిగించారు.

 

ఈ ఫొటోను చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో మాదిరిగానే బాగా పబ్లిసిటీ చేసే విధంగా వ్యవహరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పార్టీని ఆర్థికంగా దెబ్బ కొట్టి వచ్చే నాలుగేళ్లలో పార్టీని లేకుండా చేసే విధంగా కనిపిస్తున్నాడు. ఇటువంటి టైం లో ఢిల్లీ నాయకుల మద్దతు లేకపోతే..పూర్తిగా టిడిపి కనుమరుగైపోయే పరిస్థితి ఉందని ప్రస్తుతం చంద్రబాబు ..మోడీ ఇస్తున్న ప్రతి పిలుపు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇదంతా వేరుగా మోడీ దగ్గరకు వెళ్ళడం కోసం వేస్తున్న ప్లాన్ లు అని అంటున్నారు చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: