కరోనాతో ఈ ప్రపంచం ఏమైపోతుంది.. ఇప్పుడు సామన్యుడు మొదలుకుని ఆర్థిక శాస్త్రవేత్తల వరకూ అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇది. కరోనా ప్రభావం ఎప్పటి వరకూ ఉంటుంది. ఇది ప్రపంచ మానవాళిపై చూపించే ప్రభావం ఎంత.. ఎన్ని దేశాలు ఈ కరోనా ప్రభావంతో ఇబ్బంది పడతాయి. ఇంకా ఎంత కాలం ఈ కరోనా పీడ ఉంటుంది.. కరోనాకు మందు ఎప్పుడు కనిపెడతారా..?

 

 

ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబుల కోసం అంతా ప్రయత్నిస్తున్నారు. కొందరు దీన్ని ప్రపంచంలోనే అదిపెద్ద సంక్షోభంగా చెబుతున్నారు. ప్రపంచం చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని చూడబోతోందని మరికొందరు అంటున్నారు. 1930, 2008 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరోసారి పునరావృతం అవుతాయంటున్నారు. అయితే అదే సమయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు మరికొందరు.

 

 

అలాంటి వారు చెప్పేదేమింటంటే.. నిజమే ప్రపంచం పెను సంక్షోభంలో ఉన్నమాట వాస్తవమే. అయితే.. 1930లతో పోలిస్తే ఇప్పుడు సంక్షోభాలను ఎదుర్కొనేందుకు మానవాళిమరింత సర్వసన్నద్ధంగా క్రియాశీలకంగా ఉందంటున్నారు నిపుణులు. గతంలో పెరిగిన టెక్నాలజీ, పదునెక్కిన మానవ మేథస్సు వంటివి ఇప్పటి తరానికి ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు.

 

 

గతంలో పోల్చుకుంటే ప్రపంచానికి భరోసా ఇస్తున్న అంశాలను పరిశీలిస్తే.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు గవర్నెన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. మానవ మేథస్సు బాగా పెరిగింది. వైద్య సౌకర్యాలు పెరిగాయి. అంతేకాదు.. సంక్షోబాలను ఎదుర్కొనేందుకు దేశాల, ప్రభుత్వాల సామర్థ్యం గతంలో పోలిస్తే పెరిగింది. మొదట్లో కాస్త తడబడినా కరోనాను తప్పకుండా జయిస్తామనే నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతగా బెంబేలు పడిపోవాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. మరి ఏం జరగబోతోంది.. ప్రపంచం 1930 ల నాటి గడ్డు రోజులు మళ్లీ చూస్తుందా.. లేక కరోనా మహమ్మారి కోరలు వంచుతుందా.. అన్నది కాలమే తేల్చాలి.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: