భారతదేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ధాటికి ప్రజలంతా ఇళ్ళల్లో నుండి బయటకు రావడం మానేశారు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం వల్ల ఎన్నో జీవితాలు తలకిందులు అయిపోయాయి. అయినా కరణ మహమ్మారి చలించడం లేదు. తనదైన శైలిలో విజృంభిస్తూ రోజుకి వందలాది మందిని దాడి చేస్తూనే ఉంది. ఒకవైపు దీనికి సరైన వ్యాక్సిన్ ను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు విపరీతంగా ప్రయత్నిస్తూ వుండగా మరొకవైపు పరిశోధకులు ప్రజలకు వీలైనంత అవగాహనను వైరస్ గురించి కల్పించాలని తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

 

అలాంటి ఒక పరిశోధనలో భాగంగా బయటకు వచ్చిన విషయం ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది. విషయం ఏమిటంటే కరోనా వైరస్ ఉపరితలాల పైన ఎన్నేసి గంటలు జీవించి ఉంటుంది అన్న విషయంపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకూ కరెన్సీ నోట్లు, టిష్యూ పేపర్లు, బట్టలు, స్టీలు వస్తువులు, గాజు మరియు చెక్కతో తయారుచేసిన వస్తువులు.... ఇలా చాలా వాటి ఉపరితలం పై కరోనా జీవిత కాల వ్యవధిని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

 

అయితే మనందరం రోజు కరోనా బారిన పడకుండా ధరించే మాస్కులపై వైరస్ ఎన్ని రోజులు ఉంటుంది అనే విషయం పై పరిశోధన చేస్తూ ఉండగా వారికి ఒక షాకింగ్ నిజం తెలిసింది. మనం ధరించే సాధారణ ఫేస్ మాస్క్ పైన కరోనా దాదాపు 7 నుండి 10 రోజుల పాటు నివసిస్తుందట. కాబట్టి మనం ధరించిన ఫేస్ మాస్క్ ను చేతితో పట్టుకోవడం లేదా జేబులో పెట్టుకోవడం మరియు వాడిన దానిని రెండోసారి వాడడం వంటివి చేయడం ఆపివేయాలి. లేదా మాస్క్ పై ఉన్న వైరస్ మనకి సోకే అవకాశం భారీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: