ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు కరోనా కల్లోలం కొనసాగుతుంటే..మరోవైపు జోరుగా కరోనా రాజకీయం కూడా సాగుతోంది. కరోనా కష్టకాలంలో ఉద్యోగుల వేతనాలను ఏపీ సర్కారు విడతల వారీగా ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలోనూ ఇదే పని చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో ఈ సమస్యపై పెద్దగా వ్యతిరేకత రాలేదు.

 

 

ఏపీలో మాత్రం విపక్షాలు ఈ అంశాన్ని కూడా రాజకీయ అస్త్రంగా మలచుకుంటున్నాయి. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ, గతంలో ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న అశోక్ బాబు ఒక రోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. దీనిపై రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఉద్యోగులను అడ్డం పెట్టుకుని పదవి సంపాదించిన చరిత్ర గల టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం నీచ రాజకీయం అని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు.

 

 

అసలు ఉద్యోగుల కోసం ఇప్పుడు దీక్ష చేసేంత అవసరం ఆయనకు ఏమొచ్చిందని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఆయన నిరాహార దీక్ష రాజకీయ కుట్రలో భాగమేనని బొప్పరాజు మండిపడ్డారు. గతంలో ఉద్యోగుల జీవితాన్ని తాకట్టు పెట్టిన ఆయన తమ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బొప్పరాజు విమర్శించారు. ఉద్యోగ సంఘంలో ఉన్నప్పుడు చేయని దీక్షలు అశోక్‌బాబు ఇప్పుడెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

 

 

అంతే కాదు.. తమను కదిలిస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను బయటపెడతామని.. ఉద్యోగుల జోలికి రావొద్దని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వార్నింగ్ ఇచ్చేశారు. 50 శాతం జీతాలు రాకుండా అడ్డుకొవాలని అశోక్ బాబు కుట్ర పన్నుతున్నట్లు అనిపిస్తుందని బొప్పరాజు అనుమానం వ్యక్తం చేశారు. ఏపీఎన్జీవో ఉద్యోగ సంఘ నాయకులు పై రాజకీయ ముద్ర పడేలా చేసిన చరిత్ర అశోక్ బాబుదని వెంకటేశ్వర్లు విమర్శించారు.

 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: