దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయి ఒక పెద్ద మారణహోమంకి అంతా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కొంతమంది బాధ్యత లేకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అతి తక్కువ కేసులతో రెండవ దశలో ఆగిపోవాల్సి కరోనా వ్యాప్తి దురదృష్టకరంగా మూడవ స్టేజీలోకి వడివడిగా అడుగులు వేస్తూ ఉండగా తబ్జిజి జమాత్ సమావేశం కూడా వైరస్ వ్యాప్తికి మైలేజ్ ఇచ్చింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కొంతమంది మూర్ఖులు వల్ల దేశం ఘోరమైన ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున కొన్ని రాష్ట్రాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాయి.

 

ఇప్పటికే వేల మందికి కరోనా సోకి దేశవ్యాప్తంగా పరిస్థితి అంతా అదుపుతప్పింది. ఇక మార్కజ్ వ్యవహారానికి వస్తే తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చాలా ఘోరంగా దీని దెబ్బకు బలి అయ్యాయి. క్రమంలో ఉద్దేశపూర్వకంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోన్న కరోనా రోగుల పట్ల కఠిన చట్టం అమల్లోకి తెచ్చింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.

 

ఇకనుండి రాష్ట్రంలో ఎవరైనా కరోనా సోకిన వారు ఇతరులపై ఉమ్మడం-తుమ్మడం వంటి చర్యలు చేస్తే దానిని హత్యాయత్నం కింద పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా అలాంటి వారు చేసిన చర్య వల్ల ఎవరైనా చనిపోతే హత్యాయత్నం కేసుని మర్డర్ కేసు గా మార్చి విచారించాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకుంది.

 

హిమాచల్ ప్రదేశ్ వేసిన ముందడుగు అందరికీ ఆదర్శనీయమే. ప్రమాదకర పరిస్థితుల్లో ఇలాంటి కఠిన నిర్ణయాల వల్ల ఎంతో కొంత ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇంతా చూస్తే.. అక్కడ బయటపడిన కేసులు 13 మాత్రమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు చాలా తీవ్రంగా కృషిచేస్తోంది. ఇదిలా ఉండగా... సౌదీ అరేబియాలో కరోనా రోగులు గాని సాధారణ వ్యక్తులు గాని బహిరంగంగా ఎక్కడ ఉమ్మినా ఉరి శిక్ష వేయాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: