ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా దెబ్బకు అల్లాడిపోతుంటే కొంతమంది మృగాలు వైరస్ యొక్క వ్యాప్తిని ఉద్దేశపూర్వకంగా పెంచేందుకు ప్రయత్నిస్తూ ఉండటం చాలా విచారకరం. ఇప్పటివరకు కరోనా బారిన పడిన దేశాల సంఖ్య 190 దాటగా వాటిలో గల్ఫ్ దేశాలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇక సౌదీ అరేబియా సంగతికి వస్తే ఏప్రిల్ 4 తేదీకి దేశంలో 2039 పాజిటివ్ కేసులు నమోదు కాగా 25 మంది ప్రాణాలను కోల్పోయారు ఇకపోతే సౌదీ దేశానికి రాజు అయిన సల్మాన్ రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు 21 రోజుల పాటు లాక్ విధించారు.

 

ఇకపోతే సౌదీలో రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఆడవారి మీద చేయి వేస్తే జనాల మధ్యకు తెచ్చి రాళ్లతో కొట్టి చంపి సంస్కృతి ఉన్న దేశంలో మనం చిన్న తప్పుగా భావించే ప్రతి ఒక్క దానికి అక్కడ పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయి. అటువంటి సౌదీ దేశంలో దేశానికి చెందని ఒక వ్యక్తి బల్జురాషి గవర్నరేట్ లోని ఆల్-బహ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు.

 

కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తి బయటకు వచ్చి ఒక షాపింగ్ మార్ట్ లోనికి వెళ్లి షాపింగ్ చేసే కార్డ్స్ పైన మరియు అక్కడ ఉన్న తలుపుల పైన కావాలని ఉమ్ముతూ అతని ఎంగిలిని పోస్తూ పట్టుబడ్డాడు. అతని దుశ్చర్యని గమనించిన షాపు వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అతనిని గత శుక్రవారం అరెస్టు చేశారు.

 

చివరికి అతనికి మరణ దండన విధించి కొద్దిరోజుల్లోనే ఉరి తీయబోతున్నాడని సమాచారం. ఇక మన దేశంలో కూడా హిమాచల్ ప్రదేశ్ సర్కారు కరోనా ఉన్న పేషెంట్ ఎవరిమీదైనా ఉమ్మినా మరియు కావాలని తుమ్మినా అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: