కరోనా వైరస్ కంటికి కనిపించదు.. కానీ ప్రాణాలను తీస్తుంది. ప్రపంచమంతా అత్యంత వేగంగా వ్యాపించిన ఈ కరోనా వైరస్ కొన్ని వేల ప్రాణాలు తీసింది. అయితే అది భారత్ లోకి ప్రవేశించడంతో కరోనా వైరస్ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. 

 

అయితే ఇప్పుడు సమస్య ఏంటి అంటే? బయట నుండి తీసుకువచ్చిన కూరగాయలను, పండ్లను సంచుల మీద హెయిర్ డ్రయ్యర్ తో వేడి పడేలా చేస్తే కరోనా వైరస్ చస్తుంది అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.. అంతేకాదు మరికొందరు బయట నుండి ఎం తీసుకొచ్చినా అవి ఎండలో పెట్టిన తర్వాతే తింటున్నారు. 

 

అయితే నిజానికి కరోనా వైరస్ ఎండలో పెట్టిన చావదు.. ఇందుకు నిదర్శనం ఈ వేడి వాతావరణంలో కూడా కరోనా వైరస్ బతి ఉంటుండటమే. అందుకే బయట నుండి ఏమి తీసుకొచ్చినప్పుడు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇంకా కూరగాయలు అయితే ఎప్పుడు కూడా శుభ్రంగా కడిగే తినాలి. ఎందుకంటే వాటిపై ఉండే పురుగుమందుల, దుమ్ము దూళి అన్ని కూడా పోతాయి కాబట్టి.   

 

అంతేకాదు కూరగాయలను ఎప్పుడు కూడా కట్ చెయ్యకముందే కడగాలి.. అప్పుడే పరి శుభ్రంగా ఉంటాయి.. ఇంకా ఈ కరోనా వైరస్ కు ఎప్పుడైనా కూడా పరిశుబ్రగా కడగటమే మార్గం. ప్రస్తుతం అంతకు మించిన మార్గం ఏది లేదు. అంతే తప్ప హెయిర్ డ్రయ్యర్ తో వేడి పడేలా చేసిన.. ఎండలో పెట్టిన కరోనా మహమ్మారి చావదు.

మరింత సమాచారం తెలుసుకోండి: