దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 14వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడిగిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కేంద్రం కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ట్రాన్స్ పోర్ట్ సర్వీసులను ఆపేసింది. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుండగా 15వ తేదీ నుంచి ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చని కొన్ని విమానయాన సంస్థలు అనుమతిచ్చాయి. 
 
అయితే విమానాలు ప్రయాణిస్తాయా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం కష్టమే అని వినిపిస్తోంది. కేంద్రం నుంచి ఏప్రిల్ 14న లాక్ డౌన్ ను ఎత్తివేస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన రాలేదు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీని లాక్ డౌన్ కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మోదీ లాక్ డౌన్ ఎత్తివేసినా కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగనుందని సమాచారం. అందువల్ల దేశీయ విమాన సర్వీసులు పని చేస్తాయా...? లేదా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
 
లాక్ డౌన్ సమయంలో ఎవాక్యుయేషన్ విమానాలు, కార్గో విమానాలు, ఇండియన్ ఏవియేషన్ నుంచి అనుమతి పొందిన ప్రత్యేక విమానాలు, ఆఫ్ షోర్ హెలికాఫ్టర్ ఆపరేషన్స్, అనుమతి పొందిన ప్రత్యేక విమానాలు మాత్రమే పని చేస్తున్నాయి. దేశీయ విమానయాన సంస్థలు మోదీ లాక్ డౌన్ ను పొడిగిస్తే ప్రయాణికులకు టికెట్లను క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పిస్తాయని తెలుస్తోంది. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4281కు చేరింది. ఇప్పటివరకూ కరోనా భారీన పడి 109 మంది మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: