కరోనా కట్టడికి కేంద్రం అదిరిపోయే ఐడియాతో స్కెచ్ గీస్తోంది. ఓవైపు క‌రోనా కొత్త పాజిటివ్ కేసులు నమోద‌వుతున్న వేళ లాక్‌డౌన్ ఎత్తివేత‌కు కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయితే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌నం అవుతున్న వేళ‌..ఇంకా కొన‌సాగిస్తే కోలుకోలేని విధంగా దెబ్బ‌తింటామ‌ని వ్యాపారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఈనేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను ద‌శ‌ల వారీగా ఎత్తివేయాల‌నే ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం ముందుకు తీసుకువ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ప‌ల్లెల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న టౌన్ల‌లోనూ ఇబ్బంది లేదు. మేజ‌ర్ ప‌ట్ట‌ణాల్ల‌ని కీల‌కమైన సంస్థ‌లు అంటే హాస్పిట‌ల్స్ ఓపీ, నిత్యావ‌స‌ర వ‌స్తువుల త‌యారీ సంస్థ‌లు, ఫార్మా వంటి రంగాల‌కు తొలి ప్రాధాన్యంగా లాక్‌డౌన్ ఎత్తివేత‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. 

 

పలు చర్యలు సహా లాక్ డౌన్ అమలు చేస్తున్నది. అయితే లాక్ డౌన్ కాలంలోనూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న చోట్లను హాట్ స్పాట్లుగా గుర్తించి కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. అయితే.. కేసులు భారీగా పెరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై ఇప్పటికే తలమునకలైంది. ఈ విషయమై హెల్త్ మినిస్ట్రీ ఓ వ్యూహాన్నీ రూపొందించింది. కేసులు అధికంగా నమోదు అవుతున్న చోట్లను బఫర్ జోన్ లు ( సుమారు 5 కిలోమీటర్ల పరిధి!) గా గుర్తించి వాటిని పూర్తిగా సీల్ చేసే వ్యూహంతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముందుకు క‌దులుతోంది. లాక్‌డౌన్ య‌థావిధిగా కొన‌సాగుతుంది. 

 

అక్క‌డి జ‌నాన్ని ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రానివ్వ‌రు.. బయటి జ‌నాన్ని ఆ ప్రాంతానికి పోనివ్వ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటారు. ఆ జోన్లోని కరోనా బాధితులు సహా అనుమానితులనందరినీ ఆస్పత్రులకు త‌ర‌లించ‌డం జ‌రుగుతుంది. పేషెంట్లకు రెండు సార్లు పరీక్ష నిర్వహించి రెండుసార్లూ నెగటివ్ వస్తేనే వారిని ఆస్పత్రి నుంచి బయటకు పంపించ‌డం జ‌రుగుతుంది.  కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించినవారిని క్వారంటైన్ చేస్తుంది. మధ్యస్థంగా లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి.. సీరియస్ గా కనిపిస్తే అడ్వాన్స్ హాస్పిటల్ కు తరలిస్తుంది. గుర్తించిన జోన్లలో స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులను బంద్ కొన‌సాగుతుంది. చివరి కేసు తర్వాత నెల రోజుల పాటు కొత్తగా ఎటువంటి కేసు వెలుగుచూడకుంటేనే ఆ జోన్ లో ఆంక్షలు సడలించ‌డం జ‌రుగుతుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: