మందులేని మ‌హ‌మ్మారి క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు ఎంచుకున్న ఒకేఒక మార్గం లాక్‌డౌన్‌. దాదాపు 27 పెద్ద‌దేశాల్లో లాక్‌డౌన్ అమ‌లు కొన‌సాగుతోంది. చాలా దేశాల్లో పాక్షిక లాక్‌డౌన్‌..అనేక ఆంక్ష‌ల మ‌ధ్య ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి కొన్ని దేశాల్లో అనుమ‌తులు లాక్‌డౌన్ అనేది వివిధ రూపాల్లో అమ‌ల్లో ఉంది. ఇక భూ మండ‌లంపై  పావువంతు జ‌నాభాను క‌లిగిన భార‌తదేశంలోనూ లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో దేశంపైనే కాదు..ప్ర‌పంచంపైనా అన్నిరంగాల్లోనూ మంద‌గ‌మ‌నం మొద‌లైంది. 21రోజుల పాటు లాక్‌డౌన్ అమ‌లుకు ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేర‌కు దేశ ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. 

 

అయితే స‌మ‌స్య‌లు అంతే స్థాయిలో ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా వ్యాపార సంస్థ‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతోంది. ఇది నిరుద్యోగం పెరిగేందుకు కార‌ణ‌మ‌య్యే ప‌రిస్థితులకు దారితీస్తుండ‌టంతో కేంద్ర ప్ర‌భుత్వం అల‌ర్ట్ అవుతోంది. లాక్‌డౌన్‌ను కొన‌సాగించడం వ‌ల్ల క‌రోనాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొవ‌డానికి వీలుంది. అయితే మిగ‌తా అంశాల‌పై ఇది తీవ్ర‌మైన ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు నిపుణులు సూచిస్తున్నారు. క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌ట‌మే కాదు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను చ‌క్క‌దిద్దుకుంటున్న చైనాను ఇప్పుడు అన్ని దేశాలు గుడ్డిగా ఫాలో అవుతున్నాయంటే ఆశ్చ‌ర్య‌మేమీ లేదు. ఇప్పుడు భార‌త్ కూడా అదే దారిలో న‌డిచేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

 

కేంద్రం త‌క్ష‌ణ క‌ర్త‌వ్యంగా నాలుగైదు రోజుల‌కు మించి లాక్‌డౌన్ పెంపున‌కు ఆదేశాలు ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు, అధికారులు చెబుతున్న మాట‌. మ‌హా అయితే కొన్ని ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తూ మ‌హా అయితే వారం పాటు లాక్‌డౌన్ పెంపున‌కు ఆదేశాలివ్వవచ్చంటున్నారు. ఓ వైపు క‌రోనాను ఎదుర్కొంటూనే సామాన్య‌జ‌నానికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా, సంస్థ‌ల లావాదేవీల‌ను, కార్య‌క‌లాపాలు య‌థావిధిగా జ‌రిగేలా చూడాల‌ని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే బంఫ‌ర్ జోన్ల ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీద‌కు తెచ్చింది. ఎక్క‌డ క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌య్యాయో అక్క‌డ మాత్రం నిర్బంధం కొన‌సాగుతుంది. మిగ‌తా చోట్ల‌లో లాక్‌డౌన్ ఎత్తివేసి సాధార‌ణ జ‌న‌జీవానానికి అనుమ‌తులివ్వాల‌ని  కేంద్ర ప్ర‌భుత్వం ప్రాథ‌మిక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. చూడాలి ఏం జ‌రుగుతుందో..

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: