మనదేశంలో మందబుద్ధులతో పాటుగా అతి తెలివిపరులు ఉన్నారు.. వెనకటికి వెర్రి వెంగళప్ప బస్సెక్కి రెండు టికిట్స్ కొన్నాడట.. ఒకతను అది చూసి నువ్వు ఒక్కడివే కదా బస్సెక్కావు మరి రెండు టికిట్స్ ఎందుకని అడిగితే.. ఒకటికిట్ పోయాదనుకో రెండోది ఉంటుండిగా అని సమాదానం ఇచ్చాడట.. దానికి అతను ఆ రెండో టికిట్ కూడా పోతే అని ప్రశ్నిస్తే.. నా దగ్గర బస్సు పాస్ ఉందిగా అని చంకలు గుద్దుకుంటూ చెప్పాడట.. ఇప్పుడు కరోనా విషయంలో మనవారి పరిస్దితి కూడా ఇలాగే ఉంది..

 

 

ఆదివారం దీపయజ్ఞం చేయండి.. అది ఎవరు ఇళ్లనుండి కదలకుండా.. మాత్రమే అని మన ప్రధాని గారు చెబితే ఇది అక్షరాల పాటించకుండా.. ఒక దీపం వెలిగిస్తేనే కరోనా పారిపోతే, మంటలు పట్టుకుని ర్యాలీలు తీస్తే ఇక మనదేశానికే కరోనా రాదని ఆలోచించిన మేధావులు కొందరు సామాజిక దూరాన్ని కూడా పాటించకుండా, దీపావళి పండగను మరిపించేశారు. మరికొందరు చేసిన పనికి అగ్నిప్రమాదాలు కూడా సంభవించాయి.. ఇలా బాధ్యతారాహిత్యంగా మెలగడం ఎంతవరకు కరెక్ట్ అనేది వారి వారి విజ్ఞతకే వదిలేస్తే.. ఇన్ని రోజుల లాక్‌డౌన్ వల్ల తగ్గిపోయిన ఆ కాస్త కాలుష్యాన్ని బ్యాలెన్స్ చేశారు.

 

 

అసలు ఈ దీపం ఉద్దేశం ఏమిటో.. ఎవరూ ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేదు. రోడ్ల మీదకు వచ్చేశారు. గో కరోనా గో..అంటూ గుంపులు, గుంపులుగా ర్యాలీలు తీశారు. గో కరోనా అంటే అది పారిపోవడానికి నీ పెంపుడు కుక్క కాదుగా.. ఈ మాత్రం ఆలోచన కూడ రాలేదా మట్టి బుర్రలకి అని అంటున్నారు కొందరు.. ఇకపోతే ఇన్ని రోజుల నుండి ఇళ్లకే పరిమితమయి.. మానసిక విశ్వాసాన్ని కోల్పోతున్న వారికి.. నమ్మకం కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగుంటాయేమో కానీ.. అతి ఉత్సాహంతో .. మొత్తం లక్ష్యానికే దెబ్బపడేలా చేయడం మన వాళ్ల స్పెషాలిటి. నాటి చప్పట్లలో కాస్త అతి కనిపించింది కానీ.. ఇప్పుడు అది పీక్స్ కు వెళ్లిపోయింది. నెక్ట్స్ .. బిగ్ బాస్ మోడీ ఎం టాస్క్ ఇస్తారో కానీ.. ఈ సారి మరింత రచ్చ రచ్చ చేస్తారు కావచ్చు మన ప్రజలు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: