అవును.. ఆ ఆలయంలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 వేలకుపైగా ఎలకలు అందులో ఉన్నాయి.. అన్ని ఎలకలు అక్కడ ఎందుకు ఉన్నాయి.. అసలు ఎలకలు ఎలా అని అనుకుంటున్నారా? అక్కడ ఎలుకలే స్పెషల్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్ వద్ద ఉన్న కర్ణి మాత ఆలయం ప్రపంచంలోని వింతైన దేవాలయాలలో ఒకటి.. 

 

ఈ ఆలయంలో ఎలుకలు ఎక్కువ.. అవి ఆలయాల్లోని తిని అక్కడే నివసిస్తాయి.. అయితే ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులు వీటిని పూజిస్తారు.. వాటిని 'కబ్బాస్' పవిత్ర ప్రాణులు అని పిలుస్తారు. అయితే ఆ ఎలుకలను కాళ్ల క్రింద పడకుండా జాగ్రత్తగా నడవాలి.. పొరపాటున కూడా ఎలుకను తొక్కి చంపారు అంటే అపవిత్రతకు కారణమైన వ్యక్తి ఆ ఎలుక విగ్రహాన్ని ఘన బంగారంతో తయారు చేయించాలి. అందుకే ఎంతో జాగ్రత్తగా చూసుకొని నడవాలి. 

 

 

అక్కడ నివసించే పూజారుల కుటుంబాలు ఎలుకలకు ఆహారం ఇవ్వడంతో పాటు వాటి విసర్జనను కూడా ఎప్పటికి అప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ ఆలయ పునాదికి కారణం కర్ణి మాత. ఈమె దుర్గాదేవి ఉపాసకురాలు . 14వ శతాబ్దం కాలం నాటి నుండి ఏకంగా 150 సంవత్సరాలు జీవించారు అని.. చిన్నప్పటి నుండి కర్ణి మాతకు అతీంద్రియ శక్తులు ఉన్నాయి అని.. ఆ శక్తుల ద్వారా అక్కడి ప్రజల కష్టాలు అన్ని తొలిగించేది అని అందుకే ఆమెను దేవతగా కొలిచేవారు అని చెప్పారు. 

 

అయితే ఒక రోజు ఉన్నట్టుండి కర్ణి మాత అదృశ్యం కావడంతో భక్తులు ఆమె ఇంటి వద్దే ఆలయం నిర్మించే పూజలు చేయడం ప్రారంభించారు అని.. ఆతర్వాత ఓ రోజు కర్ణి మాత భక్తులకు సాక్షాత్కరించి వారితో మాట్లాడుతూ.. తన వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా తిరిగి ఎలుకలుగా జన్మించి ఆలయంలోనే ఉంటారని, వారిని సేవిస్తూ ధన్యులు కమ్మని అనుగ్రహించిందట. ఇక అప్పటి నుండి అక్కడ ఎలుకలు నివసిస్తున్నాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: