ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. గంట గంట‌కూ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా బాధితుల సంఖ్య 303కు చేరింది. 
రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో  అప్రమత్తమైన‌ కేంద్రం తగు చర్యలను సూచించింది.  కోవిడ్‌-19 వైరస్‌ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రకాశం జిల్లాను రెడ్‌ జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చింది.  జిల్లాలో ఇప్పటి వరకూ 24 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో 23 కేసులు ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రార్థనతో సంబంధం ఉన్నవే కావ‌డం గ‌మ‌నార్హం. నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని జిల్లా అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో కోవిడ్‌-19 అత్యధికంగా ప్రబలే అవకాశం ఉండటంతో కఠిన చర్యలు తీసు కోనున్నారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నారు. ఇప్పటికే కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. అయితే జిల్లాను రెడ్‌ జోన్‌గా కేంద్రం ప్రకటించినందున లాక్‌డౌన్‌ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: