ప్రపంచంలో కరోనా కలిగించే విపత్తు వల్ల అల్లకల్లోలం చెలరేగుతుంటే.. బుద్ధిలేని కొందరు మాత్రం తమ సుఖాలకోసం ఆలోచిస్తున్నారు.. అరే బయట కనపడితే పోలీసు మామలు బొక్కలు ఇరగదీస్తున్నారు.. ఆ భయం కూడా లేకుండా రోడ్లమీదికి వస్తున్నారు కొందరు.. ఇది ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టిన చర్యనే కానీ, ఎవరికో లబ్ధి చేకూర్చాలని చేస్తున్న లాక్‌డౌన్ కాదు..

 

 

ఇకపోతే ఒక యువతి మాత్రం చాలా విచిత్రంగా బయట ఉన్న పరిస్దితులతో తనకేం మాత్రం సంబంధం లేనట్లుగా, తనకు బాయ్ ఫ్రెండ్ కావాలని పోలీసుష్టేషన్ మెట్లు ఎక్కిందట.. ఇలాంటి చిత్ర విచిత్రమైన కేసులను చూసి పోలీసులకు నవ్వాలో, ఏడ్వాలో కూడా అర్థం కావడం లేదట.. ఇకపోతే బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు సోమవారం ఉదయం ఓ యువతి వచ్చి సార్‌.. నా బాయ్‌ఫ్రెండ్‌ను చూడాలని ఉంది.. దయచేసి వెళ్ళేందుకు పోలీసు అనుమతి ఇవ్వండి అంటూ అడిగిందట..

 

 

దీంతో షాకవ్వడం పోలీసుల వంతైంది. అయితే వాస్తవానికి ఆమెను ప్రేమిస్తున్న యువకుడు ఆదివారం ఉదయం అంబర్‌పేట నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12కు వచ్చాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించి ఆమె తల్లిదండ్రులకు తెలుపగా, వారు అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కాగా ఆ యువకుడు ఆమె మీద తనకు ఎలాంటి ఇష్టం లేదని చెప్పడానికే వచ్చానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం తన బాయ్‌ఫ్రెండ్‌ను తాను కలవాల్సిందేనని, అతన్ని చూడటానికి అనుమతి ఇవ్వాలంటూ పట్టుబట్టగా.. పోలీసులు ఆమెకు సర్దిచెప్పి పంపించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: