కరోనా వైరస్.. ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్నా వైరస్.. రోజు రోజుకు పెరుగుతున్న వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 13 లక్షల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. ఇంకా అందులో 74 వేలమంది మృతి చెందారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ కు ఎలాంటి విరుగుడు లేకపోయే సరికి ఈ వైరస్ ఇంకా ఎక్కువ వ్యాపిస్తుంది. అయితే ఈ వైరస్ ఎక్కువగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపైనే తీవ్రంగా ఉంటుంది. 

 

అయితే ఆయుర్వేధంగా ఈ కరోనా వైరస్ ను తరిమేయచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ తులసి ఆకులను.. ఆహారంలో దాల్చినచెక్క, మిరియాలు, శొంఠి, కిస్‌మిస్‌ ఉండేలా చూసుకొని వాటిని తింటే కరోనా దగ్గరకు కూడా రాలేదని చెప్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలు ఎవరికివారు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అని ఆయుష్‌ ప్రొటోకాల్‌ను ప్రకటించింది. 

 

నీళ్లలో పుదీనా, వాము వేసి ఆవిరి పట్టుకుంటే జలుబు తగ్గుతుంది.

 

లవంగాల పొడిని తేనె లేదా పంచదారతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 

నువ్వుల నూనెలో నెయ్యి వేసి మూడు నాలుగు చుక్కలను ఉదయం, సాయంత్రం ముక్కులో వేసుకోవాలి.

 

ఒక టేబుల్‌స్పూన్‌ నువ్వు ల నూనెను నోట్లో వేసుకొని ఆయిల్‌ పుల్లింగ్‌ చేసి ఆతర్వాత గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. ఇలా రోజు రెండు సార్లు చెయ్యాలి. 

 

రోజంతా గోరు వెచ్చని నీళ్లు తాగడం మంచిది. 

 

పసుపు, జీలకర్ర, కొత్తిమీరను రోజూ వంటల్లో ఉపయోగించండి.

 

హెర్బల్‌ టీ తాగడం మంచిది. 

 

తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి వేసుకొని తయారుచేసిన హెర్బల్‌ టీ మరింత మంచిది. రోజుకు రెండు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

 

పైన చెప్పిన చిట్కాలు పాటించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కాలు పాటించి మీ ఆరోగ్యాన్ని రక్షించుకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: