ఏపీలో క‌రోనా మ‌హమ్మారి చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 303కు చేరింది. కాగా వైర‌స్ బారిన ప‌డి ముగ్గురు మ‌ర‌ణించారు.  295 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ద‌వాఖాన‌లో చికిత్స పొంది ఐదుగురు కోలుకున్నారు. రాష్ట్రంలో అత్య‌ధికంగా  కర్నూలు జిల్లాలోనే మరో 21 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 74కు చేరింది. అంతకు ముందు.. ఆదివారం ఒక్క రోజే కర్నూలు జిల్లాలో 49 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాష్ట్రం మొత్తం మీద నమోదైన కేసుల్లో 25 శాతం ఈ జిల్లాలోనివే కావడం గమనార్హం. దీంతో కర్నూలు జిల్లాలో హైఅలెర్ట్‌ ప్రకటించారు. ఇక సోమవారం నెల్లూరు జిల్లాలో 8 కేసులు, పశ్చిమ గోదావరిలో 6, విశాఖలో 5, కడపలో 4, అనంతపురంలో 3, గుంటూరులో 2, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. కాగా కేంద్ర ప్ర‌కాశం జిల్లాను రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించింది.   ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 303 కేసుల్లో 23 కేసులు తప్ప మిగిలిన 280 కేసులు ఢిల్లీ వెళ్లివచ్చిన వారితో సంబంధాలున్నవేనని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: