కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు. దింతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. సామజిక మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న 25మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

సామజిక మీడియాలో వస్తున్నా తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ఐటీశాఖ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ వెబ్ సైట్ వారం రోజుల్లో 20 తప్పుడు అంశాలను గుర్తించి వివరణలు జోడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, సమాచారంపై వాస్తవాన్ని ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వీటిపై గత వారం రోజుల్లో దాదాపు 200 ఫిర్యాదులు అందాయని ఐటీశాఖ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ తెలిపారు.

 

ప్రతి నిమిషం 300 మందికిపైగా వెబ్‌సైట్‌ ను చూస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే, వైద్యులు, పోలీసులు, అధికారుల పేరిట తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు సమాచారాన్ని సృష్టించే వ్యక్తులు తాము పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

సోషల్ మీడియాలో పాత వీడియోలు, ఫొటోలను తమకు అనుకూలంగా ఎడిట్ చేసి, ప్రస్తుత అంశాలను జోడించి సామాజిక మాధ్యమాల్లో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులపై నిజనిర్ధారణ చేసేందుకు ఆరు గంటలకు పైగా సమయం పడుతోంది. ఆలోగా వైరల్ అవుతోంది. 

 

ఫేక్ న్యూస్ ని అరికట్టేందుకు 2019లోనే తెలంగాణ ఐటీశాఖ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం కరోనాపై వస్తున్న తప్పుడు సమాచారాన్ని విశ్లేషించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించింది. ఆదేశానుసారం దేశంలోనే తొలుత తెలంగాణ ఐటీశాఖ ఈ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: