తన జీవితంలో ఎప్పుడూ కరోనా వంటి కష్టమైన పరిస్థితిని చూడలేదు అంటున్నారు తెలుగుదేశం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. భూమి మీద పాపం బాగా పెరిగినప్పుడు.. ప్రకృతి, దేవుడు ఇలాంటిది ఒకటి సృష్టించి జనాలను తీసుకవెళుతుంటాడు అని అన్నారు. ప్రతి వంద సంవత్సరాలకి ఒకసారి ఇలాంటివి సంభవిస్తున్నాయని.. పాపం అంటే చంపడం, నరకడం కాదని.. దుర్మార్గమైన వాతావరణాన్ని మనకి మనం సృష్టించబడం అని ఆయన అన్నారు.

 


ఇవన్నీ శృతి మించితే దేవుడు, ప్రకృతి దానంతట అదే కేర్ తీసుకుంటుంది ఆయన తెలిపారు. నిజానికి అవే కొంత కంట్రోల్ చేయడానికి చూస్తుందని.. ఇంతటి పెద్ద విపత్తు ఎవరూ చూడలేదని తెలిపారు. నిజానికి ఇది మానవ జాతికి ఒక హెచ్చరిక, మనం అలాగే మనం చేసే పనులలో శుభ్రంగా ఉండాలని ప్రకృతి హెచ్చరిస్తోందని తన అభిప్రాయం వ్యక్తపరిచారు జేసీ దివాకర్ రెడ్డి. కరోనా వైరస్ నియంత్ర కోసం పోలీసులు, డాక్టర్లు వారి శ్రమకు మించి పోరాడుతున్నారని జేసీ వారిని ఉద్దేశించి అన్నారు. 

 


రాజకీయాల కోసం కరోనా వైరస్ ని ఉపయోగించుకోవడం మంచి పద్దతి కాదన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా కరోనాను కట్టడి చేసేందుకు చాలా కష్టపడుతున్నారని.. అయినా తప్పు ఏదైనా జరిగితే అది కేవలం ప్రజలదే తప్ప ప్రభుత్వాలది కాదని ఆయన చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ కరోనా నుండి అందరూ సురక్షితంగా బయటపడాలని ఆయన ఆకాంక్షించారు.

 


కరోనా సమయంలో మాత్రం రైతుల సమస్యలపై జేసీ దివాకర్‌ రెడ్డి స్పందించారు. రైతులు నిజంగా చాలా కష్టపడున్నారని, మిగతా దేశాల్లో పరిస్థితి వేరుగా.. ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది  అన్నారు. నిజానికి దేశంలో రైతు సుభిక్షంగా ఉంటేనే అందరూ బాగుంటారని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం మాయ మాటలు గొప్పగా చెబుతున్నా సాయం మాత్రం అందడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ బడ్జెట్ అంతా నవరత్నాలు తప్ప ఏమి లేదన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: