ఢిల్లీలోని మతపరమైన సదస్సులో పాల్గొన్న ప్రజల వలన భారతదేశంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మొన్న నిన్న కలిపి ఏకంగా వెయ్యి పైచిలుకు ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిసింది. కానీ గత 24 గంటల వ్యవధిలో కేవలం 354 కేసులు మాత్రమే నమోదయ్యాయి, అయిదు మరణాలు సంభవించాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువ అని వైద్య అధికారులు అభిప్రాయపడుతున్నారు.


అయితే తాజా కోవిడ్19 కేసులతో భారత దేశంలో ఇప్పటి వరకు 4421 కరోనా కేసులు నమోదు కాగా... 114 మంది కరోనా పీడితులు మృత్యువాత పడ్డారు. 4421 కరోనా రోగులలో తబ్లీజీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారే 1500 ఉన్నారు. కరోనా వైరస్ ఎక్కువ శాతం అనగా 76% పురుషులకే రావడం గమనార్హం. మరణించిన వారిలో కూడా అధిక శాతం అనగా 63% మగ వృద్ధులే ఉంటున్నారు. 114 మంది మృతులలో డయాబెటిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు.


4421 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ప్రస్తుతం 3981 మంది చికిత్స పొందుతుండగా... 326 మంది వ్యాధి నుండి రికవర్ కాగా... 114 మంది చనిపోయారని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇకపోతే కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే డాక్టర్లకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటీవల గుజరాత్ కు చెందిన సంజీవని అనే ఓ మహిళా డాక్టర్ పై ఇరుగుపొరుగువారు ఘోరంగా అవమానించారు. ఆమె తన ఇంటికి వెళ్తుంటే... నీకు కరోనా వైరస్ కచ్చితంగా సోకి ఉంటుంది, ఇక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి' అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ఆమె పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన పోలీసులు ఆమెకు అండగా నిలిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: