క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా.. ఇదే హాట్ టాపిక్‌. ప్ర‌స్తుతం దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఈ వైరస్ ఎటాక్ చేస్తుందోనన్న భయమే అందరిని బెంబేలిత్తిస్తోంది. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు 1345653కి చేరగా... రికవరీ అయిన వారి సంఖ్య 278413కి చేరింది. మ‌రియు మృతుల సంఖ్య 74644కి చేరింది. చైనాలో మారుమూల ప్రదేశంలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు ప్ర‌పంచ‌దేశాల‌ను అత‌లా కుత‌లం చేస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. అంద‌రూ నివార‌ణ‌పైనే దృష్టి పెట్టారు.

 

అయితే ఎలా వ‌చ్చింది..? ఎక్క‌డ నుంచి వ‌చ్చింది..? అంటే  కరోనా గబ్బిలాల వల్ల వచ్చిందని కొందరు, కాదు పాముల వల్ల వచ్చిందని మరికొందరు, లేదు... ఆలుగు వల్ల వచ్చిందని ఇంకొదరు చెబుతూ వ‌స్తున్నారు. కానీ వీటికి ఎలాంటి ఆధారాలు లేవ‌న్న‌ది వాస్తవం. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌రోనాపై మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కరోనా వైరస్ అనేది ఓ రైతు వల్ల వచ్చిందని ఒక‌ థియరీ చెబుతోంది. ఎలాగంటే గబ్బిలాల్లోని పేగుల్లో కరోనా లాంటి వైరస్‌లు ఉంటాయి. ఈ గబ్బిలాల మూత్రం నుంచి అవి బయటకు వస్తుంటాయి. ఈ మూత్రాన్ని గ్వానో అని అంటారు. 

 

ఇది గుహల్లో లభిస్తుంటుంది. అయితే చాలా దేశాల్లో దీన్ని మొక్కలకు ఎరువుగా వాడుతుంటారు. అందుకు గుహల్లోంచి గబ్బిలం గ్వానో పొలాల్లో వాడుతుంటే అందులోని కరోనా వైరస్.. ఇద్దరు రైతులకు వ్యాపించిందనీ, వారు చైనాలోని వుహాన్ వచ్చి ఇతరులకు వ్యాపించేలా చేశారన్నది తాజా థియరీ సారాంశం. అయితే ఇది వ‌ర‌కూ నిజం.. ఎంత వ‌ర‌కూ అబద్ధం అన్నదానికి స‌మాధానం లేదు. ఇది కేవ‌లం అంచనా, ఊహ మాత్రమే అంటున్నారు. కాగా, చైనాలోని వుహాన్ నగరంలో మొదట కరోనా వైరస్ ను గుర్తించారు. ఆ త‌ర్వాత ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల‌ను అతి త‌క్కువ స‌మ‌యంలో ఏ స్థాయిలో క‌మ్మేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: