ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా భయంతో వణికిపోతుంది.  ప్రస్తుతం ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలో మరణాలు చూస్తుంటే ఇక కలియుగాంతం దగ్గర పడిందా అన్న అనుమానాలు వస్తున్నాయి.  అయితే ఇంత క్లిష్ల పరిస్థితిలో భారత దేశంలో మాత్రం మరణాల సంఖ్య పెద్దగా లేవు.. దీనికి కారణం ఇక్కడ కరోనా ప్రబలిపోతున్న సమయంలో తీసుకున్న చర్యలు.  గత నెల నుంచి కరోనాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. జనతా కర్ప్యూ తర్వాత లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  నిన్న తెలంగాణ సీఎం  కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ను కొనసాగించడమే మంచిదని చెప్పారు.

 

ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి విన్నవిస్తున్నానని... ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని చెప్పారు. తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు, నటి విజయశాంతి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు.  కరోనాను పూర్తిగా అరికట్టాలంటే లాక్ డౌన్ ను మరిన్ని రోజులపాటు కొనసాగించాల్సిందేనని విజయశాంతి చెప్పారు. మధ్యలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం లేకపోలేదని అన్నారు. 

 

ఇప్పడు డబ్బు ముఖ్యం కాదు.. మన ప్రాణాలు ముఖ్యం.. సీఎం కేసీఆర్ అన్నట్లు బతికి ఉంటే గంజినీళ్లైనా తాగి ఉండొచ్చు అన్నారు.  అసలు మనం ప్రాణాలతో ఉంటే ఏదైనా సాదిస్తామని అన్నారు విజయశాంతి.  ప్రజా సంక్షేమం దృష్ట్యా లాక్ డౌన్ ను కొనసాగించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను సంపూర్ణంగా సమర్థిస్తున్నానని చెప్పారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: