ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తున్న కరోనా కేసులు తగ్గడం తో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. కేవలం ఒక్క కేసు మాత్రం నమోదు అయింది; కరోనా కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గు ముఖం పడుతుంది. అయితే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

 

మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రానికి ప్రమాదం తప్పినట్టే అని కొందరు అంటున్నా సరే కేసులు పెరిగే అవకాశాల మీద ఇప్పటికే ఒక అంచనాకు రాలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో మర్కాజ్ యాత్రికుల నుంచి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చాలా వరకు అదుపులోనే ఉన్నాయి అనేది అర్ధమవుతుంది. 

 

ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 304 కి చేరుకుంది. ఈ కేసులు ఇక్కడితో ఆగి ఒకటి రెండు కేసులతో ఉంటే పర్వాలేదు గాని... మరీ పెరిగితే మాత్రం రాష్ట్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రభుత్వం ఎక్కడిక్కడ చర్యలు చేపడుతుంది. కరోనా కేసులు నాలుగు రోజుల్లో అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నాలుగు రోజుల్లో అదుపులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశలు పెట్టుకుంది. అటు కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను చాలా వరకు జాగ్రత్తగా గమనిస్తుంది. పరిస్థితులను అరా తీస్తుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: