కరోనా వైరస్ చికిత్స కోసం ప్రపంచ దేశాల నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. దింతో ఎగుమతులపై భారత్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి కాస్త ఎక్కువగా వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో భారత్ పెద్ద మనసుతో వ్యవహరించబోతుంది. కేవలం మానవతా దృక్పథంతో క్లోరోక్విన్ మందుతో సహా అవసరమైన ఇతర ఔషధాల్ని ఆయా దేశాలకు సరఫరా చేయబోతున్నామని విదేశాంగశాఖ ప్రకటించింది.

 

 


అదేమాదిరి పొరుగుదేశాలకు పారాసిటమాల్, హైడ్రాక్సీక్లోరోక్విన్ అవసరమైన మొత్తానికి లైసెన్స్ అనుమతులు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని రాజకీయం చేసే వారు భారత్ పై ఆరోపణలు చేసే ప్రయత్నాల్ని ఇంతటితో స్వస్తి పలకాలి అని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కరోనా వైరస్ కి చికిత్సకు ఎలాంటి టీకాగానీ, మందు గానీ లేవు. కాకపోతే మలేరియాను నయం చేయడానికి ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ చెప్పుకోతగ్గ ఫలితాలు ఇస్తోందని పరిశోధకులు ప్రాథమికంగా కన్ఫర్మ్ చేశారు.

 

 

 

ఈ పరిస్థితులలో వీటిని రోగులకు దగ్గరగా ఉండే వ్యక్తులు ఉపయోగించాలని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (APDA), భారత వైద్య పరిశోధన మండలి సూచనలు చేసింది. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ మందుకు భారీ డిమాండ్ పెరిగింది. కాకపోతే భారత అవసరాలకు అవసరమైనన్ని, ఆ తర్వాత అదనంగా మరో 25 % నిల్వలను ఉంచుకొని.. మిగిలిన హైడ్రాక్సీక్లోరోక్విని ఇతర దేశాలకు సరఫరా చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. అయితే ఈ నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయకుండా, కేవలం కొద్ది మినహాయింపులు మాత్రమే కలిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: