అగ్ర రాజ్యం అమెరికా ఇప్పుడు భారత్ సాయం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ఆ దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ప్రపంచ దేశాల సహాయం కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు అమెరికాకు భారత్ నుంచి వైద్య సాయం చాలా అవసరం. అమెరికా కరోనా వైరస్ ని ఎదుర్కోవాలి అంటే మలేరియాను ఎదుర్కొనే మందునే వాడాలని ఎక్కువగా భావిస్తుంది. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా దీని మీదే ఆశలు పెట్టుకున్నారు. 

 

భారత్ లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి గాను ఆ మందు చాలా అవసరం. అది ఇప్పుడు అమెరికాకు కూడా అవసరం అయింది. అందుకే ఇప్పుడు అమెరిక మన దేశం ముందు మోకరిల్లింది అనే విషయం అర్ధమవుతుంది. అమెరికాలో కరోనా కట్టడి అయ్యే పరిస్థితి ఇప్పట్లో కనపడటం లేదు. అయితే మన దేశం ఇప్పుడు అమెరికాకు మందు సాయం చెయ్యాలా వద్దా అనే దాని మీద ఎక్కువగా ఆలోచిస్తుంది. 

 

ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడి కి నాలుగు సార్లు దీని గురించి ఫోన్ చేసినా సరే ట్రంప్ కి దీనిపై ఇప్పటి వరకు మోడీ నుంచి హామీ లభించలేదు. దానికి తోడు అమెరికా సహా ఇతర దేశాలకు చేసే ఎగుమతుల పై భారత్ పాక్షికంగా నిషేధం విధించింది. 27 మందుల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ట్రంప్ నుంచి ఒత్తిడి వస్తే భారత్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పుడు ఇప్పుడు దీనిపై చర్చలు జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: