ఏపీ జ‌నాల‌కు గుడ్ న్యూస్‌. ఏపీలో గ‌త 24 గంట‌లుగా చూస్తే క‌రోనా ఉధృతి త‌గ్గుముఖం ప‌ట్టింద‌నే చెప్పాలి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీలో క‌రోనా జోరు అందుకోవ‌డంతో కేసులు ఒక్క‌సారిగా 304కు చేరుకున్నాయి. ఇక ఏపీలో అత్య‌ధికంగా క‌ర్నూలు జిల్లాలో 74 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక రెండో స్థానంలో నెల్లూరు జిల్లాలో 43 కేసులు ఉన్నాయి. ఇక రాజ‌ధాని కేంద్ర‌మైన బెజ‌వాడలో ఇప్ప‌టికే 17 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. వీరిలో ఒక‌రు మృతి చెందారు. ఏపీ మొత్తం మీద ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా దెబ్బ‌తో ముగ్గురు మృతి చెందారు.


ఇక గ‌త 24 గంట‌ల్లో కేవ‌లం రాష్ట్రం అంత‌టా ఒక్క కేసు మాత్ర‌మే న‌మోదు అయ్యింది. అది కూడా గుంటూరులో మాత్ర‌మే కావ‌డం విశేషం. దీనిని బ‌ట్టి చూస్తే ఏపీలో క‌రోనా కేసులు తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌డింద‌నే అనాలి. ఈ కేసుల్లో చాలా వ‌ర‌కు మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల కోసం వెళ్లిన వారివే ఉన్నాయి. ఇక ఏపీలో అన్ని జిల్లాల్లోనూ క‌రోనా కేసులు విజృంభిస్తున్నా.. ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో మాత్రం క‌రోనా కేసులు ఒక్క‌టి కూడా న‌మోదు కాలేదు. ప‌క్క‌నే వైజాగ్ ఉన్నా ఈ రెండు జిల్లాల‌ను క‌రోనా ట‌చ్ చేయ‌క‌పోవ‌డం మంచి ప‌రిణామంగా చెప్పుకోవాలి.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: