ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకు చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతానికి 304కి చేరింది. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం 10  గంటల సమయం లోపు ఒక కొత్త కేసు నమోదు అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ కేసు గుంటూరులో నమోదు అవ్వడం జరిగింది. 

 

 


ఇక అసలు విషయానికి వస్తే... ఏప్రిల్ 1 వ తేదీన కర్నూల్ లోని జీజీహెచ్ లో చేరిన 45 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. నేడు అతను మరణించాడు. అయితే అతను ఎక్కడ కూడా విదేశాల్లో ప్రయాణించలేదు. అతనికి అంతకముందే డయాబిటిస్ సమస్యలున్నాయని, ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి నివారణ కోసం సర్కార్ గట్టిగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరగడం నిజానికి కలవరం గురిచేస్తుంది. ఇక ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన కరోనా వైరస్ కేసుల వివరాల విషయానికి వస్తే వివరాలు ఇలా ఉన్నాయి. 

 

 


వివరాలు ఇలా... అనంతపూర్ - 6, చిత్తూరు - 17, తూర్పుగోదావరి - 11, గుంటూరు - 33, కడప - 27, కృష్ణా - 29, కర్నూలు - 74, నెల్లూరు - 42, ప్రకాశం - 24, విశాఖపట్నం - 20, పశ్చిమ గోదావరి - 21, విజయనగరం, శ్రీకాకుళంలో - 0 కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఆసుపత్రిలనుంచి డిశ్చార్జి అయ్యారు. ఇదివరకే కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. తాజాగా కర్నూల్ లో ఒకరు మరించిన వ్యక్తితో రాష్ట్రంలో మరణాల సంఖ్య 4 కి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: