రోజురోజుకి పాతాళానికి పడిపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ఈరోజు కాస్త పుంజుకున్నాయి. దీనికి కారణం అనేకమని చెప్పవచ్చు. ముక్యంగా అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పడ్డాయి. ముఖ్యగా అన్ని విభాగాల్లో ఎక్కడ కూడా నష్టాల వైపు చూడకుండా  లాభాల వైపు పరుగులు పెడుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో  సంబంధించి మంచి లాభాలతో కొనసాగుతుండగా మిగితావి లాభాల వైపు పరుగులు పెడుతున్నాయి.

 

 


ప్రస్తుతం సెన్సెక్స్1183 పాయింట్లు లాభంతో 28774 వద్ద, నిఫ్టీ 321 పాయింట్లకు చేరి 8405 వద్ద లాభాలతో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అన్ని రంగాల షేర్లు లాభాలతో పరిగెడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ టాప్ గెయినర్ గా ఉండగా.., నిఫ్టీ బ్యాంకు ఏకంగా 1000 పాయింట్లకు పైగా లాభాలతో ముందుకు సాగుతోంది. ఇంకా అలాగే ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, ఎం అండ్ ఎండ్, యాక్సిస్, కోటక్ మహీంద్ర, హెచ్ యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, వేదాంతా, టైటన్, హీరో, సన్ ఫార్మ లాభాలతో కొనసాగుతున్నాయి.

 

 


ఇది ఇలా ఉండగా ఏకంగా బజాజ్ ఫైనాన్స్ 5 శాతం నష్టపోతోంది. అలాగే కొత్తగా వచ్చిన sbi క్రెడిట్ కార్డు కూడా నష్టాల చూపులు చుస్తుంది. rbi తాజా నిబంధనల ప్రకారం మనీ మార్కెట్లు కేవలం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. అయితే ఈ సమయాలని ఏప్రిల్ 17 వరకు ఈ సవరించిన వేళలు కొనసాగిస్తారు. దేశంలో ఒక పక్క కరోనా ఎక్కువగా కొనసాగుతున్న మార్కెట్లు ఇలా లాభాల బాటలో సాగడం నిజంగా శుభ సూచకం.

మరింత సమాచారం తెలుసుకోండి: