ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు గత కొన్ని రోజుల నుంచి కరోనా విజృంభిస్తుండటంతో తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల తర్వాత కేసుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో ఈరోజు ఒక్క కేసు మాత్రమే నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 304కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 364కు చేరింది. 
 
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గత రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడంతో రెండు రాష్ట్రాల్లో కాంటాక్ట్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఇన్నిరోజులు రెండు రాష్ట్రాల్లో ఢిల్లీ మత ప్రార్థనలకు భారీ సంఖ్యలో ముస్లింలు హాజరు కావడంతో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షలు నిర్వహించడం జరిగింది. 
 
కొన్ని జిల్లాల్లో మాత్రం వీరికి సంబంధించిన రిపోర్టులు అందాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు సకాలంలో మర్కజ్ కు హాజరైన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించడం, ప్రజలు తీసుకున్న జాగ్రత్తల వల్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఏప్రిల్ 14వ తేదీలోపు రెండు రాష్ట్రాల్లో కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: