కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. దేశంలో లాక్ డౌన్ విధించటంతో పండగలను, శుభకార్యాలను కొందరు వాయిదా వేసుకున్నారు. మొదట మార్చి 31వరకు గడువు విధించిన దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఏప్రిల్ 14 వరకు గడువును పెంచారు. అయినప్పటికీ దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే వందకు పైగా చనిపోయారు. ఇంకా వేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

 

దేశంలో లాక్ డౌన్ విధించటం వలన వలస కూలీలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. దాతలు వారికి సహాయం చేస్తున్న ఆకలికి తట్టుకోలేక కొందరు కాలి నడకన స్వగ్రామానికి ప్రయాణమయ్యారు. ఇది ఇలా ఉండగా  రాష్ట్ర సరిహద్దులో ఒక్క అనూహ్య ఘటన చోటు చేసుకుంది. 

 

అంగరంగ వైభవంగా పెళ్లి చూసుకుందాం అనుకున్నారు. కానీ వారి పెళ్లికి కరోనా అడ్డు వచ్చింది. పెళ్లి కొడుకును పక్క రాష్ట్రంలోకి పంపించడానికి పోలీసులు నిరాకరించడం, కనీసం పెళ్లి కూతురిని ఆ రాష్ట్రంలోకి పంపించడానికి కరోనా నియమాలు అడ్డంకి రావడంతో వారు తల్లడిల్లిపోయారు. వధూవరుల కుటుంబ సభ్యుల ఆవేదన అర్థం చేసుకున్న స్థానికులు చెక్ పోస్టులోనే అనుకున్న ముహూర్తానికి నవ దంపతులను ఒక్కటి చేశారు. పగవాళ్లకు కూడా ఇలాంటి కష్టాలు వద్దు దేవుడా అంటున్నారు నవ దంపతులు.

 

కర్ణాటక పోలీసులు చెక్ పోస్టులో మొండిగా వ్యవహరించడంతో కనీసం మమ్మల్ని తమిళనాడులోకి వెళ్లడానికి అనుమతి ఇస్తే అక్కడే ఎదో ఒక దేవాలయంలో పెళ్లి చేసుకుంటామని ఉషా కుటుంబ సభ్యులు తమిళనాడు పోలీసులకు మనవి చేశారు. అయితే లాక్ డౌన్ ఉండటంతో ఇరు రాష్ట్రాల పోలీసులు అడ్డు చెప్పారు.


మంత్రి సురేష్ కుమార్ కూడా అక్కడే ఎదైనా దేవాలయంలో పెళ్లి చేసుకోవాలన్నారు. బాణహళ్ళి చెక్ పోస్టు పరిసర ప్రాంతాల ప్రజలు వారే పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. వధూవరులు ఉషా, అరవింద్ లను బాణహళ్ళి చెక్ పోస్టు సమీపంలోని శ్రీ గణపతి దేవాలయంలో సింపుల్ గా చకచకా పెళ్లి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: