చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని ఇరకాటంలో పెట్టిందన్న విషయం తెలిసిందే.. కాగా ఈ వైరస్‌ను తొలిసారిగా 1960లో కనుగొన్నారు.. ఇకపోతే ఈ వైరస్ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌లో వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు ఇప్పటి వరకు కనుగొనబడలేదు.. ఇక మొట్టమొదట కరోనా లక్షణాలను గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్...

 

 

ఇదిలా ఉండగా ఈ కరోనా వైరస్ భయంతో ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజలు ఇంటిపట్టునే ఉండిపోవడంతో నగరాలు నిర్మానుష్యంగా మారాయి.. ఇక వూహన్‌లో పుట్టిన ఈ వైరస్ వల్ల ఈ వూహన్ నగరం శ్మశానంలా మారిపోయింది.. వూహాన్ నగరంలో ఎన్ని ప్రాణాలు పోయాయో లెక్కే లేదు.. ఇక చైనా లెక్కల ప్రకారం.. ఆ దేశంలో కరోనా వైరస్‌తో మొత్తం 3,305 మంది ప్రాణాలు కోల్పోగా, వుహాన్ నగరంలోనే 2,548 మరణాలు సంభవించాయి. అయితే, కరోనా మరణాల విషయంలో చైనా వెల్లడించిన వివరాలపై ముందు నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

వాస్తవాలను దాచిపెట్టి ప్రపంచదేశాలనూ డ్రాగన్ తప్పుదోవ పట్టించదనే ప్రచారం జరుగుతోంది.. అయితే తాజాగా అక్కడ కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టేసరికి చైనా ప్రభుత్వం వుహాన్ నగరాన్ని శుభ్రం చేసే పనిలో పడింది.. ఇక్కడ మనకు కనిపించే వీడియోలో ఆ నగరాన్ని పరిశుభ్రం చేయడానికి ఎంతమంది సిబ్బంది ఎన్ని విధాలుగా శ్రమపడుతున్నారో ఈ వీడియోలో చూస్తే అర్ధం అవుతుంది.. చివరికి విమానాలను కూడా ఎలా శుద్ధిచేస్తున్నారో ఇక్కడ చూడవచ్చూ.. అడుగడుగున కెమికల్స్ స్ప్రే చేస్తూ సిబ్బంది పడుతున్న ఆరాటం చూస్తే అర్ధం అవుతుంది.. మళ్లీ వుహాన్ నగరాన్ని యధాస్దితికి తేవడానికి చేస్తున్న వారి ప్రయత్నం.. అది ఫలించాలని కోరుకుందాం..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: