మెగాస్టార్ చిరంజీవి... నిజ జీవితంలో కూడా మెగాస్టార్ అని అనిపించుకోవడంలో సాటి ఆయనికి ఆయనే అనొచ్చు. ఎప్పటికప్పుడు తనవంతు సహాయంగా బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకులు సంస్థలకు సహాయం చేస్తూనే ఉంటారు. ఇటీవల కరోనా లాక్ డౌన్ తరుణంలో సినీ కార్మికుల కోసం కరుణ క్రైసిస్ చారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ప్రతి ఒక్క సినీ నటీనటులు అందరూ కూడా సహాయం చేయడం కూడా మనం గమనించాం. 

 

 


తాజాగా చిరంజీవి తన ఒక అభిమాని గుండె జబ్బుతో బాధ పడుతున్నారని తన వంతు సహాయం కూడా ఆయన చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వస్తే... గుంటూరు జిల్లా చిరంజీవి అంజన మహిళా సేవ సంస్థ అధ్యక్షురాలుగా విధులు నిర్వహిస్తున్న వెంకట నాగలక్ష్మి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి నాగలక్ష్మికి అందవలసిన చికిత్స నిమిత్తం సహాయం అందజేశారు. 

 

 


గుండె ఆపరేషన్ కు కావాల్సినవన్నీ కూడా స్వయంగా చిరంజీవి చూసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆమెను హైదరాబాద్ కు పిలిపించి మంచి హార్ట్ సర్జన్ తో చికిత్స కూడా చేయించారు. అంతేకాకుండా నాగలక్ష్మికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా తన వంతు సహాయం అందించారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా అభిమానుల ఆరోగ్యం కోసం సహాయం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిని అందరూ శభాష్ అని అంటున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి ఇలా చేయడం మనకు కొత్త ఎం కాదు. నిజానికి ఆయన అనేక రకాలుగా సేవ కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు ప్రజలకి దెగ్గారనే ఉన్నారు మన కొణిదెల శివ శంకర వరప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: