దేశంలో కరోనాపై యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా వైరస్ ఇప్పుడు అన్ని దేశాల్లో మారణహోమం సృష్టిస్తుంది.  ముంబై ధారావీలో మంగళవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది.  అయితే ఈ కరోనా 80,50 వయసు ఉన్న వారికి సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

 

 కొద్ది రోజుల క్రితం ఈ వైరస్ సోకిన మహిళతో వీళ్లు కలిసి ఉన్న కారణంగానే ఆ మహమ్మారి వీరికి సోకినట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. వీరిద్దరు ధారావీలోని బాలిగా నగర్‌కు చెందిన వారిగా గురించారు.   ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 1వ తేదీన ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  ధారావీలో కరోనాను అరికట్టేందుకు స్థానిక అధికారులు వీలైనంత పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఇక మహారాష్ట్రలో 748 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు.

 

748మందిలో 56 మంది ఈ మహమ్మారితో పోరాడి గెలిచి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.అధికారులు ధారావీలోని బాలిగా నగర్, వైభవ్ అపార్ట్‌మెంట్, ముకుంద్ నగర్, మదీనా నగర్‌లను సీజ్ చేసింది.  ఇదిలా ఉంటే.. భారత దేశంలో వైరస్ ఇంకా మూడో దశ (కమ్యూనిటీ ట్రాన్స్‌ మిషన్‌)కు రాకపోయినా గత వారం రోజుల నుంచి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: