దేశవ్యాప్తంగా కారణం వైరస్ కోరలు చేస్తూ ఎంతోమందిని భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో అయితే పరిస్థితి రోజురోజుకు చేయి దాటిపోతుంది . కేంద్ర ప్రభుత్వం తోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడ ఫలితం మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు మహమ్మారి కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఇప్పటికే కఠిన  నిబంధనను అమల్లోకి తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు... తమ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరిన్ని కఠిన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో కరోనా  వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న  రాష్ట్రాల్లో ఒకటి దేశ రాజధాని ఢిల్లీ. 

 

 

 దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగి పోతుంది. అయితే ఢిల్లీలో భారీగా కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోవడానికి ముఖ్యకారణం ఢిల్లీలో జరిగిన మర్కజ్ మత  ప్రార్థనలు. ఇప్పటివరకు ఏకంగా ఢిల్లీలో 525 మంది కరోనా  వైరస్ భారిన పడ్డారు . అయితే రోజురోజుకు మహమ్మరి కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో కేజ్రీవాల్ సర్కారు కొత్త  కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా  వైరస్ను డిల్లీ నుంచి తరిమికొట్టేందుకు సరికొత్త ప్లాన్ ను సిద్ధం చేసింది కేజ్రీవాల్ సర్కార్. ఇందుకోసం ఫైవ్ టి ప్లాన్ను రూపొందించారు. 

 

 

 ఇంతకీ ఈ 5 టి  ప్లాన్ అంటే ఏంటి అంటారా... టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, టీం వర్క్, ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ అనేది 5 టి అని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వివరించారు. రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా  వైరస్  కేసుల దృశ్య 12000 హోటల్ గదిలను  అద్దెకు తీసుకుని... వాటిని క్వారంటైన్  కేంద్రాలుగా మార్చబోతున్నాము అంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. ఒకేసారి ఎనిమిది వేల మందికి సరిపోయేలా అత్యవసర చికిత్స కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. అయితే కేజ్రీవాల్ ప్రకటించిన 5టీ లో భాగంగా ఏకంగా 16 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తారు. రాజధానిలో కరోనా  వైరస్ లక్షణాలు ఎక్కువగా ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా కరోనా  ఉన్న వారికి పూర్తిస్థాయిలో వైద్యం అందించడంతోపాటు... ప్రభుత్వ వ్యవస్థలపై పూర్తి సమన్వయంతో ఒక జట్టుగా కరోనా వైరస్  పై పోరాటం చేయడానికి దృష్టి పెడతారు. ముఖ్యంగా మర్కజ్ సమావేశానికి వెళ్లిన వారు.. వారు కలిసిన ఇతరులపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా కరోనా  వైరస్ నియంత్రించాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: