కరోనా దెబ్బకు గడిచిన వారం రోజుల్లో మన దేశంలో దాదాపు 1500 మంది వైరస్ సోకి ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నారు. తాజాగా మూడో స్టేజ్ లోకి వచ్చిన వైరస్ ధాటికి రోజుకి వందల కేసులు నమోదు అవుతుండగా తెలుగు రాష్ట్రాల్లో అమిత వేగంతో వైరస్ విస్తరిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కెసిఆర్ నిన్నటి ప్రెస్ మీట్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కి లాక్ డౌన్ సమయాన్ని మరింత పొడిగించాలని విన్నవించుకున్నారు కూడా. ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు వచ్చే ఆలోచనలు పక్కనపెట్టి ముందు ప్రజల ప్రాణాలను రక్షించాలని ఆయన సూచించారు.

 

 ఇటువంటి ఘోరమైన ఉపద్రవం మధ్య ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి వారు చావు కబురు చల్లగా చెబుతున్నారు. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ చేసిన ప్రకటన ప్రకారం ఏప్రిల్ 14 నుంచి వారు బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే ఆన్ లైన్ రిజర్వేషన్లను కూడా ప్రారంభించినట్లు చెప్పినవారు సుదూర ప్రాంతాలకు ఏసీ బస్సులు నడవవు అని మరియు ప్రస్తుతానికి సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సులకు రిజర్వేషన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే బుకింగ్స్ ఆధారంగా తర్వాత బస్సుల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉందని వివరించారు.

 

వారి దగ్గర నుండి వచ్చిన ప్రకటనను విని అంతా ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్ లో కరుణ కేసులు పుట్టగొడుగుల్లా పెరుగుతూపోతుంటే సమయంలో కాసుల కోసం కక్కుర్తి పడి ఏపీఎస్ఆర్టీసీ ప్రజల ప్రాణాలను బలి పెడుతున్న తీరు నివ్వెరపరుస్తోంది అని విమర్శిస్తున్నారు. కర్నూలులో ఒక్కరోజే 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారితో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. అంటు వ్యాధి అయిన కరోనాను కట్టడి చేయలేక ప్రపంచదేశాలు అమెరికా ఆపసోపాలు పడుతోంది.

 

కరోనా లాక్ డౌన్ ముగిసే వరకు మరికొంత కాలం బస్సులు బంద్ చేయాలని.. బస్సుల్లో జనాలు ఎక్కితే కరోనా ఇంకా చాలా వేగంగా వ్యాపిస్తుందని అంటూ.... అసలు ఈ విపత్కర సమయంలో కాసుల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి బుద్ధి ఉండాలి అంటూ తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే ఆ బస్సుల్లో ప్రయాణించే వారితో పాటు బయట ఉన్న వాళ్ళకి కూడా దీని వల్ల రిస్కేగా...! 

మరింత సమాచారం తెలుసుకోండి: