క‌రోనా లేదా కోవిడ్‌-19 ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రోజురోజుకు ఈ వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా 13,47,803 మందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటికే దీని బారిన పడి 7, 807 మందిపైగా మరణించారు. చైనాలో వుహాన్‌లో ప్రారంభమైన ఈ వైరస్ ఇటలీ, స్పెయిన్, అమెరికా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మరోవైపు ఇతర దేశాల్లో సైతం కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశాల వారీగా కేసుల సంఖ్య ఇలా ఉంది.

IHG

వాస్త‌వానికి యూఎస్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్.. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో సుస్థిర స్థానం సాధించుకున్న దేశాలు. కానీ ఇప్పుడు క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల మిగతా దేశాలతో పోల్చుకుంటే ఈ దేశాల్లోని ప్రజలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్ర‌తుకుతున్నారు. ఇక అగ్ర‌రాజ్యంగా చెప్పుకునే అమెరికా వల్ల కూడా క‌రోనాని క‌ట్ట‌డి చేయ‌డం సాధ్యం కావడం లేదు.

IHG

ఒకవైపు భారీగా పెరిగిపోతున్న కేసులు, వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించలేకపోవడంతో అగ్రరాజ్యం ఎన్నడూ ఎదుర్కోని సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుంది. ఇక భార‌త్‌లోనో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయే త‌ప్పా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే దేశ‌దేశాలు లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌ణ చ‌ర్య‌లు సైతం తీసుకుంటున్నాయి.

IHG

ఇక ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు జనాలు మాస్క్‌లు, శానిటైజర్లు వినియోగిస్తున్నారు. చాలా చోట్ల n-95 మాస్క్‌లు, సర్జికల్ మాస్క్‌లను ధరిస్తున్నారు. అయితే కొన్ని మాస్క్‌ల కొరత ఉండడంతో ప్ర‌జ‌లు చిత్ర విచిత్ర మాస్క్‌ల‌తో ముఖాన్ని కప్పుకుంటూ పిచ్చెక్కిస్తున్నారు. మ‌రి వాటిపై మీరూ ఓ లుక్కేసి ప్ర‌జ‌ల క‌ష్టాలు గుర్తించండి.

IHG

మనీలా‌లో ముఖంలో కలిసిపోయేలా వెరైటీ మాస్క్ ధరించిన మహిళ

IHG

కారకస్ (వెనెజ్వెలా)లో మాస్క్ ధరించిన మహిళ

IHG

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: