దేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తే మంచిదా లేదా అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అర్ధం కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీన్ని కట్టడి చేయడం ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితి కనపడటం లేదు. లాక్ డౌన్ ని కొనసాగించడానికి కేంద్రం ఇప్పటికే మొగ్గు చూపిస్తుంది అంటున్నారు. కాని ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేస్తుంది. అసలే ఆర్ధిక ఏడాది మొదలయింది. 

 

ఇప్పుడు గనుక లాక్ డౌన్ కొనసాగిస్తే మాత్రం మాంద్యంలో మునిగిపోవడం అనేది ఖాయం. చాలా రంగాలు ఇప్పుడు దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దివాలా తీయడం మొదలయింది అంటే ఆర్ధిక పరిస్థితి దారుణ స్థితికి దిగజారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. 

 

కట్టడికి మార్గాలు కూడా కనపడటం లేదు. మందు లేదు కాబట్టి లాక్ డౌన్ ఒక్కటే మార్గం ఇప్పుడు. అందుకే లాక్ డౌన్ ని కొనసాగించాలి అనే కోరుతున్నాయి. లక్షల్లో మరణాలు భారత్ లో ఉండే అవకాశం ఉందని విదేశీయులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి లాక్ డౌన్ విషయంలో ముందుకి వెళ్ళడమే మంచిది అనే భావనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. లాక్ డౌన్ ని సడలిస్తే మాత్రం మహారాష్ట్రలో పరిస్థితి చాలా భయంకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తమిళనాడు, కేరళ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: