ఇప్పుడు గనుక దేశంలో లాక్ డౌన్ ని ఎత్తి వేస్తే మాత్రం కొన్ని కొన్ని పరిస్థితులు ఊహకు అందవు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న సొంత రాష్ట్రం వాళ్ళు అందరూ కూడా తమ తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా జరిగితే కరోనా వ్యాప్తి మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది, ఒకరికి వచ్చినా సరే అది వేల మందికి అంటే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. 

 

లాక్ డౌన్ ని ఎత్తివేస్తే వేలాది మంది ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీనితో అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఎంట్రీ పాస్ లు ఇవ్వాలని కేంద్రం అనుమతితో ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ఎంట్రీ పాస్ ఇచ్చి లోపలి రావాలని అలాగే వాళ్ళను అవసరం అయితే క్వారంటైన్ కి తరలించడం మంచిది అనే భావనలో రాష్ట్రాలు ఉన్నాయి. దీనికి కేంద్రం కూడా ఓకే అంటుంది. 

 

ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయాలను తీసుకోవడానికి సిద్దం అయ్యాయి. ఎవరికి అయినా జ్వరం జలుబు ఉంటే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోతే మాత్రం వారి మీద చర్యలకు దిగాలని అదే విధంగా హత్యానేరం కింద కేసులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ కూడా అధికారులతో చర్చించి పరిస్థితి అంచనా వేసి అడుగు వెయ్యాలని భావిస్తుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: