ఇప్పుడు కరోనా వైరస్ ని చూసిన వాళ్లకు ఒకటే భయం.. ఇదేంటి ఇలా తగులుకుంది అని. అవును కరోనా వైరస్ తీవ్రత చాలా దారుణంగా ఉంది అనే విషయం అర్ధమవుతుంది. ఇప్పటి వరకు ఇది మనుషులకు మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు జంతువులు పక్షులకు కూడా సోకడం చూసి చాలా మందిలో ప్రాణ భయం మొదలయింది. కరోనా తీవ్రత ఇలా ఉంటుంది జంతువుల నుంచి వస్తుంది అని ఎవరూ అనుకోలేదు. 

 

కాని అది మాత్రం జంతువులకు కూడా సోకడం మొదలయింది. కరోనా సోకిన వ్యక్తి కుక్కతో ఆడుకున్నా సరే అది ఆ కుక్కకు వచ్చే అవకాశాలు ఉంటాయి. తమిళనాడు లో కాకులకు కూడా కరోనా వైరస్ వచ్చింది ఏమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా కాకులు ఆ రాష్ట్రంలో చనిపోతున్నాయి. కాకి పెంపుడు జంతువు కాదు. కాని దానికి ఏ విధంగా కరోనా వస్తుందో ఎవరికి అర్ధం కాని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. 

 

ఇక మనిషి దేన్ని పట్టుకోవడానికి కూడా దాదాపుగా లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. తినే వస్తువులు తాగే వస్తువులు వాడుకునే వస్తువులు ఏది పట్టుకున్నా సరే కరోనా వస్తుంది. గతంలో ఏదీ కూడా ఈ స్థాయిలో ప్రపంచాన్ని వేధించిన పరిస్థితి లేదు. ఏ వ్యాధికి కూడా ప్రపంచం ఇన్ని జాగ్రత్తలను తీసుకునే పరిస్థితి ఎక్కడా కనపడలేదు. కాని ఇది మాత్రం మానవ జాతి మొత్తాన్ని దాదాపుగా ఆత్మరక్షణ లో నెట్టింది. పిల్లలను ముద్దు పెట్టుకోవడానికి లేదు పెద్దలను దగ్గరకు తీసుకోవడానికి లేదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: