కరోనా ప్రభావం తెలుగు దిన పత్రికలపై బాగానే పడింది. అయితే ఈ కరోనా ప్రభావంతో కొన్ని దశాబ్దాల తరబడి తెలుగు దిన పత్రికల మధ్య జరిగిన యుద్ధానికి తాత్కాలికంగా తెర పడందనే చెప్పాలి. తెలుగు పత్రికల్లో కొన్ని దశాబ్దాలుగా వచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. ఇక ఇలాంటి మార్పుల విషయంలో మొదటి నుంచి ఈనాడు పత్రికదే అగ్ర స్థానం అని చెప్పాలి. అసలు దినపత్రిక ఉదయం ఆరు కల్లా పాఠకుడిని చేరాల్సిందే అని నియమం పెట్టుకుని దాన్ని సుసాధ్యం చేసి చూపించిన దిన పత్రిక అదే.

 

 

తెలుగు పత్రికారంగంలో ఈనాడు ప్రవేశపెట్టిన ఒరవడులు అన్నీ ఇన్నీ కావు. వాటిలో విప్లవాత్మకమైందిగా జిల్లా ఎడిషన్లను చెప్పుకోవచ్చు. అప్పటి వరకూ దేశ, అంతర్జాతీయ అంశాలే ప్రధాన వార్తలుగా ఉండే సంస్కృతి నుంచి మన పక్క వీధిలో జరిగింది కూడా పత్రికల్లో వచ్చే పరిస్థితికి ఈ జిల్లా ఎడిషన్లు ఆస్కారం కల్పించాయి. ఇక ఇదే ట్రెండును మిగిలిన పత్రికలూ ఫాలో కావాల్సిన పరిస్థితి వచ్చింది.

 

 

ఇక ఆ తర్వాత ప్రత్యేక పేజీలు.. సాక్షి దిన పత్రిక ఫ్యామిలీ అంటూ సంచలనమే సృష్టించింది. సండే మేగజైన్ నూ కొత్త పుంతలు తొక్కించింది. ఈ పోటీని అందుకుని ఈనాడు కూడా ప్రత్యేక పేజీలపై కసరత్తు పెంచి కొత్త శీర్షికలతో బదులిచ్చింది. ఇక ఇప్పుడు ఈ పోటీకి కరోనా తెరదించేసింది. ఇప్పుడు పోటీ పత్రిక ఏం చేస్తుందన్న భేషజాలు లేవు.. పోటీ పత్రిక గురించి ఆలోచన లేదు. ముందు మన సంగతి మనం చూసుకుందాం అన్న ధోరణి తప్ప. అందుకే ముందుగా జిల్లా ఎడిషన్లకు మంగళం పాడేశారు. ఇక ఆ తర్వాత సండే మేగజైన్లకూ టాటా చెప్పేశారు. ఇప్పుడు ప్రత్యేక పేజీలపైనా కోత పడింది.

 

 

ఇప్పుడు పోటీ పత్రిక మనకంటే దూసుకెళ్తుందేమో అన్న వెరపు లేదు. ఇప్పటి వరకూ ప్రత్యేక హంగులతో ఖర్చును ఇబ్బడి ముబ్బడిగా పెంచేసుకున్న పత్రికలు.. ఆ ఖర్చును తెగ్గోసుకునేందుకు ఎలాంటి పట్టింపులకూ వెళ్లడం లేదు. అన్నీ ఒకే పంథాలో కోతలకు పదును పెట్టేశాయి. అంటే కరోనా ఈ పోటీకి తెర దించేసిందన్నమాట.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: