కరోనా వైరస్ తీవ్రత మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడు అర్ధమైందా....? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా తీవ్రత విషయంలో మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు చాలా భయపడుతున్నారు. కరోనా విషయంలో ఇన్నాళ్ళు మన వాళ్ళు చాలా లైట్ గా ఉన్నారు. కాని కేసులు పెరుగుతున్న కొద్దీ మన వాళ్లకు అసలు సినిమా అర్ధమవుతుంది. దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కాక ప్రభుత్వాలు... 

 

 

పడుతున్న ఇబ్బందులను మన వాళ్ళు అర్ధం చేసుకున్నారు. కరోనా తీవ్రత ఇప్పుడు ఇప్పుడే మన వాళ్లకు స్పష్టంగా అర్ధమైంది. అందుకే జనాలు లాక్ డౌన్ పెట్టండి మహా ప్రభో అన్నట్టు వేడుకుంటున్నారు. మీరు బయటకు రావాలని చెప్పినా మేము వచ్చే పరిస్థితిలో లేమని ప్రభుత్వాలకు ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. చాలా వరకు మన రాష్ట్రాల్లో ఎవరూ కూడా అవసరం ఉంటే మినహా బయటకు వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. 

 

 

ఇప్పుడే ప్రాణాల మీద తీపి పెరిగింది మన జనాలకు. అది వచ్చింది అంటే చావడమే అనే భయం మొదలయింది. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారు అందరూ కూడా. ఎక్కడా కూడా కరోనా వైరస్ ని లైట్ తీసుకోవడం లేదు. కేసీఆర్ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం. లాక్ డౌన్ ఉంటేనే మంచిది కొనసాగించాలి అని కోరుతున్నారు. అలా అయితేనే ఏ ఇబ్బందులు ఉండవు అని భావిస్తున్నారు. మరి ఏ విధంగా ఇది ముందుకి వెళ్తుందో చూడాలి. కూలీలు కూడా లాక్ డౌన్ కావాలని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: