ఏం తమాషా చేస్తున్నారా.. ఇది ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఊతపదం.. పదే పదే గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టే అలవాటున్న చంద్రబాబు అందులో తప్పకుండా వాడే పదం ఇది. ఏం తమాషాలు చేస్తున్నారు. పిచ్చ కథలు పడొద్దు. ఇది పులివెందుల పంచాయతీ చేద్దామనుకుంటున్నారా.. అంటూ తరచూ ఆయన రెచ్చిపోతుంటారు. పాపం.. ఇప్పుడు కూడా ఆయన అలాగే రెచ్చిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

 

 

పాపం.. కరోనా సమస్య వచ్చినప్పటి నుంచి ఆయన హైదరాబాద్ లో లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. అయినా సరే అక్కడ నుంచే కరోనాపై రోజూ యుద్ధం చేస్తున్నానని చెప్పుకుంటారు. తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి.. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా.. జగన్ నా మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు కరోనా కేసులు బాగా పెరిగిపోయాయి.. ముందే నేను చెప్పినట్టు చేసి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ పాపం తెగ బాధపడిపోయారు.

 

 

ఇక జగన్ సంగతి అలా ఉంటే.. అటు మోడీ కూడా చంద్రబాబును తెగ అవమానించేస్తున్నారు. కరోనాపై పోరాటంలో ఎలా ముందుకెళ్లాలి అనే విషయంలో మోడీ దేశంలోని ప్రముఖ నాయకులందరికీ ఫోన్లు చేసి సలహాలు అడుగుతున్నారు. ఇలా దేశంలో కనీసం ఓ 20-3 మంది నాయకులకు స్వయంగా మోడీ ఫోన్లు చేసి సలహాలు అడిగారు. అందులోఅధికారంలో ఉన్నవారు మొదలుకొని ప్రతిపక్షంలో ఉన్నవారూ ఉన్నారు.

 

 

కానీ కొసమెరుపేంటంటే.. ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సంగతి మాత్రం మర్చిపోయారు. ఈ విషయం ఇప్పుడు చంద్రబాబుతో పాటు పసుపు శ్రేణులకు చాలా అవమానకరంగా మారింది. మోడీ కావాలనే చంద్రబాబు ఫోన్ చేయలేదని పసుపు మేథావులు కొందరు భావిస్తున్నారు. ఇలాంటి ఆపత్కాలంలో హుద్ హుద్ , తిత్లీ వంటి విపత్తులు తిత్తి తీసిన చంద్రబాబును సంప్రదించకపోవడమే ఈ దేశంలో అసలైన విపత్తని దేశం నాయకులు గొల్లుమంటున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: