సోషల్ మీడియాలో తప్పుడు సమాచారానికి, నకిలీ వార్తలు అడ్డూ అదుపులేకుండా  కొనసాగుతోంది. ముఖ్యంగా దేశంలో ఏదైనా ట్రెండ్ సాగుతుంటే ఆ ట్రెండ్ ప్రకారం కొంత మంది పని కట్టుకుని ప్రచారాలు చేస్తుంటారు.  తాజాగా వాట్సాప్ యాప్ వచ్చిన తర్వాత ఈ తరహా నకిలీ వార్తలు, వీడియోలు పోస్ట్ చేస్తూ జనాలను కన్ప్యూ జ్ చేస్తున్నారు. పాత వార్తలు, పాత వీడియోలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తూ, వ్యాఖ్యానాలను జోడిస్తూ  పోస్ట్ చేస్తు వుండటం ఆందోళన రేపుతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన నకిలీ వార్తలు, వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్,  టిక్ టాక్ లాంటి  ప్లాట్ ఫాంలలో  విరివిగా షేర్ అవుతూ అనేక అపోహలను, ఆందోళనలు రేపుతున్నాయి.

 

తాజాగా దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి.  తప్పుడు వార్తలతో జనాలను భయబ్రాంతులకు గురి చేసేవారిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు రెడీ చేసుకుంటున్నారు.  కోవిడ్-19 తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీని ప్రకారం వాట్సాప్ లో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు షేర్ చేయబడిన సందేశాలను ఒక చాట్‌కు మాత్రమే ఫార్వార్డ్  చేయగలం. ఈ నేపథ్యంలో  ఇక మీద తరుచుగా షేర్ చేసిన సందేశాన్ని లేదా, వీడియోను  ఒకసారి ఒక చాట్ కు మాత్రమే  ఫార్వార్డ్ చేసేలా  వాట్సాప్   ఆంక్షలు విధించింది. ఈ  నేపథ్యంలో  మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్ లో ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారాన్ని తెలుసుకునే వాట్సాప్ కొత్త  ఆంక్షలను విధించింది.

 

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్  వినియోగదారులకు ఈ  రోజునుంచే  ఈ కొత్త  నిబంధన వర్తించనుంది.  అలాగే తరచుగా ఫార్వార్డ్ చేయబడిన సందేశాలను వాట్సాప్‌లో డబుల్ టిక్‌ ద్వారా సూచిస్తుంది. సందేశాలను ధృవీకరించడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది.ఫార్వార్డ్ చేసిన సందేశాలను తెలుసుకునేలా వెబ్‌లో ఒక ఫీచర్ను వాట్సాప్ పరీక్షిస్తోంది. ఇందుకోసం  వెబ్ లో భూతద్దం చిహ్నాన్ని జోడించింది.  ప్రస్తుతం ఐవోఎస్, ఆండ్రాయిడ్  బీటా వెర్షన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.  ఈ సౌకర్యం త్వరలో వినియోగదారులకు అందుబాటులో రానుంది. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: