జగన్ కు నలు వైపుల నుంచి విమర్శల కరోనా బాణాలు వచ్చి తగులుతున్నాయి. ఒకవైపు ఏపీలో పరిస్థితి రోజు రోజుకు ముదురుతున్నా, లాక్ డౌన్ కారణంగా ఏపీలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో జగన్ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయినా ఓర్పు గానే అన్నిటినీ భరిస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన వ్యవహారాలను చక్క పెడుతున్నారు. ఈ కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వానికి, పార్టీలకు, అతీతంగా అండదండలు అందించాల్సిన రాజకీయ ప్రత్యర్ధులు యధావిధిగా రాజకీయ కోణంలోనే ప్రస్తుత పరిస్థితిని చూస్తూ... విమర్శలు చేస్తుండడంతో పాటు ఈ కరోనా విపత్తును జగన్ కు అంటించి సంబర పడాలి అని చూస్తున్నారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో జగన్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

 

IHG

 ఇదిలా ఉండగా జగన్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు ఏపీ పరిస్థితిని గురించి జగన్ కు ఫోన్ చేసి మరీ ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ చెబుతున్న సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా చూస్తున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఏవిధంగా ఉందో ప్రధానికి తెలియంది కాదు. అందుకే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోయినా 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన ఐదు వేల కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సిద్ధమై మొదటి విడతగా 1300 కోట్ల రూపాయలను లాక్ డౌన్ కి రెండు రోజులు ముందుగా విడుదల చేశారు. ఇక ఆ తర్వాత ఏపీకి కరోనా సహాయం కింద 1100 కోట్లను విడుదల చేశారు. అంతేకాకుండా ఏపీకి ఆర్థిక సహాయం ప్రకటించాలంటూ జగన్ రాసిన లేఖను కూడా ప్రధాని పరిగణలోకి తీసుకున్నారు. 

 

ఇక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మోదీ ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి వాకబు చేయడం, నిధులు విడుదల చేయాలంటూ జగన్ కోరడం జరిగాయి. ఈ సందర్భంగా ఏపీకి భారీగా నిధులు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఏపీలో ఒకవైపు బీజేపీ టీడీపీలు వైసీపీ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం జగన్ కు అన్ని రకాలుగా అండగా ఉంటూ... ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. జగన్ మోడీ ల స్నేహం మరింతగా పెరగడంతో కరోనా బాధ నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: