దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈరోజు ఉదయం వరకు 304 కొత్త కేసులు నమోదు కాగా తెలంగాణలో 364 నమోదయ్యాయి. ఈరోజు గుంటూరులో 8 కేసులు నమోదు కాగా... నిజామాబాద్ జిల్లా ఇందూరులో 10 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటంతో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 
 
దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో అసోం ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ క్వారంటైన్ కేంద్రాలపై , కరోనా వైరస్ వ్యాప్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు దేశద్రోహం క్రింద అరెస్ట్ చేశారు. 
 
అమినుల్ ఇస్లామ్ ఆలిండియా యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఆయన కరోనా గురించి, క్వారంటైన్ కేంద్రాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన కారంటైన్ కేంద్రాలు చాలా ప్రమాదకరమైనని అని... నిర్భంధ కేంద్రాలు అని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు చేశారు. 
 
వైద్యులు ఢిల్లీలో జరిగిన జమాత్ కార్యక్రమానికి హాజరైన వారి విషయంలో కఠినంగా వ్యవహరించారని వ్యాఖ్యలు చేశారు. వైద్య సిబ్బంది కరోనా రాని వారికి కూడా ఇంజక్షన్లు ఇచ్చి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పోలీసుల విచారణలో ఎమ్మెల్యే ఆ క్లిప్ తనదేనని అంగీకరించారు. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడని సమాచారం. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడంపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: