ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరుగిపోతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదు అవ్వడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో  పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయిన ప్రాంతాలలో రెడ్ జోన్లుగా  కూడా ప్రకటించడం జరిగింది. ఇందుకు పోలీసులు ఎక్కువగా జల్లెడ పట్టేందుకు ప్రయత్నాలు కూడా పలు చోట్ల మొదలు పెట్టారు. ముఖ్యంగా ప్రధాన నగరమైన హైదరాబాద్ లో తాజాగా చాలా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో పోలీసులు నిఘా బాగా పెంచారు అన్న మాటలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. 

 

 


తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పహాడీ షరీఫ్, చంద్రాయణగుట్ట, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని అధికారులు తెలియచేయడం జరిగింది. కరోనా బారిన పడిన వారిలో ఎక్కువగా ఢిల్లీలోని జమాత్‌ లో ప్రార్థనలు చేసి తిరిగి వచ్చిన వారే అని అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా..  ఈ ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి  అధికారులకు చాలా కష్టమైన పని అవ్వడంతో రాచకొండ పోలీసు అధికారులు వినూత్నంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏ ప్రాంతంలో అయితే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అయ్యాయో అక్కడ డ్రోన్ కెమెరా సాయంతో గాలింపులు చేయాలనీ పోలీస్ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

 

 

దీనితో పాటు లాక్ డౌన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే పహాడీ షరీఫ్, బాలాపూర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో డ్రోన్‌ల సహాయంతో పూర్తిగా పోలీస్  అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. డ్రోన్ల సహాయంతో పూర్తిగా ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నాలుగు అత్యంత అధునాతనమైన డ్రోన్లను రంగాల్లో దించారు. వీటి సహాయంతో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఏరియాలను కంప్లీట్ గా నిఘా ఉంచడంతో పాటుగా అక్కడ తనిఖీలు చేస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: