భార్యా భ‌ర్త‌లు శృంగారం అన‌గానే కొంత మంది భ‌ర్త‌లు డైరెక్ట్‌గా ప‌నిలోకి దిగిపోతారు. దాని వ‌ల్ల చాలా మంది ఆడ‌వారు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. అంతేకాక శృంగారం అంటేనే వారికి విర‌క్తి వ‌స్తుంది. ఎప్పుడూ సెక్స్ అంటే ముందు కాసేపు భాగ‌స్వామితో ప్రేమ‌గా మాట్లాడుతూ నెమ్మ‌దిగా ముందు రొమాన్స్ చేయాలి. ఆ త‌ర్వాత అసలైన ప‌నిలోకి దిగాలి. అంతే త‌ప్పించి ముందుగానే డైరెక్ట్‌గా చేయ‌డం వ‌ల్ల ఆడ‌వారు శృంగారమంటేనే అయిష్ట‌త చూపుతారు. అంతే కాక రెండు శ‌రీరాల క‌ల‌యిక అంటే ముందు రెండు మ‌న‌స్సుల క‌ల‌యిక  ఉంటుంది. మ‌న‌సుకు న‌చ్చితేనే ఏప‌నినైనా చెయ్య‌గ‌ల‌ము. అప్పుడే శృంగార‌మైన ఏ బంధ‌మైనా బావుంటుంది. 

 

రెండు మనస్సుల కలయిక…రెండు శరీరాల మమేకం ఒక గొప్ప ఫీలింగ్ అని చెప్పాలి. రొమాన్స్ అనేది శ‌రీరానికి మ‌న‌స్సుకు ఒక   గొప్ప రిలాక్సేషన్ ని ఇస్తుంది. శృంగారం…అదో తీయని అనుభవం అని చెప్పాలి. దాన్ని ఎలా ప‌డితే అలా చేయ‌కూడదు. అంతేకాదు ఆడ‌వారి ప‌ట్ల మొర‌టుగా కూడా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు. ఎంత ప్రేమ‌గా సున్నితంగా ప్ర‌వ‌ర్తిస్తే వారు అంత ఇష్ట‌ప‌డ‌తారు. దానివ‌ల్ల ఇద్ద‌రూ శృంగారాన్ని ఎంజాయ్ చెయ్య‌గ‌లుగుతారు.  అలా చేయ‌డం వ‌ల్ల‌ ఇటు మైండ్‌తో పాటు అటు శారీరక తృప్తి కూడా లభిస్తుంది. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే తాజాగా మరో రహస్యాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అదేమిటంటే...

 

*శృంగారం ఆరోగ్యకరమైన జీవితానికి ఒక దివ్య ఔషధంలాంటిద‌ని కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

 

* అంతేకాక  మైగ్రేన్ నొప్పిని సైతం ఇది మాయం చేస్తుంద‌ట‌. ప్రోస్టేట్ కేన్సర్ దరిచేరదు. కానీ శృంగార సమయాన్ని ఓ పదినిమిషాలకి పెంచుకోమని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల పురుషుల్లో సుమారుగా 100 క్యాలరీలు, స్త్రీలలో 69 క్యాలరీలు ఖర్చవుతాయ‌ట‌. ఇలా ఎక్కువ సేపు  చేయ‌డం వ‌ల్ల  ఇది అరగంట సేపు ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తిన దానికి సమానమట. జీవక్రియల తీవ్రత ఆరు రెట్లు పెరుగుతుంది. ఇది 20 నిమిషాలపాటు టెన్నిస్ ఆటకు లేదా 40 నిమిషాల యోగాతో సమానం.

 

గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలన్నింటికీ ఇదో మంచి కసరత్తని తేలింది. ఎలుకలపై ఈ ప్రయోగం చేసిన అమెరికా శాస్త్రవేత్తలకు ఇంకో విషయం కూడా తెలిసింది. శృంగారం తర్వాత కొన్ని ఎలుకల మెదడు కణాలు సైతం వృద్ధి అయినట్లు వారు కనుగొన్నారు. అంతే కాక శృంగారం చేసిన త‌ర్వాత శ‌రీరం మ‌న‌స్సు రిలాక్సేస‌న్ మోడ్‌లోకి ఆటోమెటిక్‌గా వెళిపోతుంది. దానితో మెద‌డు కూడా చురుకుగా ప‌ని చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: