భారత్ దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. నేడు ఈ సంఖ్య దేశంలో 4789 మంది ఈ వైరస్ బారిన పడగా, వారిలో 124 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇది ఇలా ఉండగా, ఈ వైరస్ తో పోరాడి 353 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ సాయంత్రానికి 6 గంటల వరకు నమోదైన వివరాలను రాష్ట్రాల వారీగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

 

 

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రెస్ మీట్ లో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన మర్కజ్ కు వెళ్లినవారు సుమారు 1000 మందికి పైగా ఉన్నారు. వారందరినీ ట్రాక్ చేశామని ఈ సాయంత్రం వరకు 304 కరోనా కేసులు నమోదయ్యాయి. కొన్ని చోట్ల కరోనా హాట్ స్పాట్లను గుర్తించామని 1800 నుంచి 2000 మందిని పరీక్షలకు గుర్తించాం అని తెలిపారు. కాకపోతే ఇంకా ఎక్కడైనా అనుమానితుల నుంచి నమూనాలు సేకరిస్తాం అని ఆయన తెలిపారు. ఇక అలాగే హోం ఐసోలేషన్ లో ఉంటూ భౌతిక దూరం పాటిస్తే త్వరగా కోలుకొనే పరిస్థితి ఉంటుంది అని జవహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

 

 

ఇక అలాగే తెలంగాణ విషయానికి వస్తే సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తం 364 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో కేసులు నమోదు అయ్యాయి. అయితే రాష్ట్రంలో మాత్రం ఎక్కడ ఎవరు మరణించలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మాత్రం కర్నూల్ లో ఒకరు కరోనా కారణంగా మృతి చెందాడు. ఇక మరణాల విషయానికి వస్తే తెలంగాణాలో 11 మంది, ఏపీలో మొత్తం నలుగురు మరణించారు. ఇవన్నీ ఎలా ఉన్న దేశంలో రోజురోజుకి పెరుగుతున్నాయి. ఎవరికీ వారు స్వతహాగా ఇంట్లో క్వారెంటన్ పాటిస్తే భారత్ లో కరోనా వైరస్ ని అరికట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: