ప్రస్తుతం భారత దేశంలో కరోనా వ్యాప్తిని సమూలంగా అరికట్టే నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  దాంతో దేశం మొత్తం ఎక్కడివి అక్కడే స్థంబించిపోయాయి. విద్యా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది.  పదవతగతి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి.. దాంతో ఇప్పుడు పదవతరగతి విద్యార్థులకు ఏపిలో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు.  ప్రస్తుతం ఇంటి పట్టున ఉంటున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.  

 

ఇంటి వద్దనే విద్యార్థులు క్లాసులు వినేలా చేస్తున్నారు.  విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో రేపటి నుంచి దూరదర్శన్ సప్తగరి ఛానెల్ ద్వారా ఉ. 10 నుంచి 11 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరక పాఠ్యాంశాలు బోధించనుండగా,  సందేహాల నివృతి చేసుకునేందుక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. 

 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటి పట్టున ఉండాలని.. విద్యార్థులు శ్రద్దగా పాఠాలు నేర్చుకోవాలని తెలియజేస్తున్నారు.  మరోవైపు ఏపిలో ఈ మద్య కాలంలో కరోనా వైరస్ కేసులు మరిన్ని పెరిగిపోతున్న విషయం తెలిసిందే. 

 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: