కరోనా విస్తృతి ని కట్టడి చేయడం కోసం  దేశ వ్యాప్తంగా  ఈ నెల 14  వ తేదీ వరకు లాక్ డౌన్  కొనసాగనుంది . అయితే కరోనా కేసులు క్రమేపి పెరుగుతోన్న నేపధ్యం లో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు లేకపోలేదన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి . కేంద్ర ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ పొడిగించే కంటే సడలింపుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు అందుతోన్న నేపధ్యం లో  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి లాక్ డౌన్ ను పొడగించాల్సిందేనని   సూచించారు .

 

కరోనా కట్టడికి లాక్ డౌన్ మినహా మరొక ప్రత్యామ్నాయం   లేదంటూ కుండబద్దలు కొట్టారు  . దేశంలో ప్రజారోగ్య సేవలపై ఆయన ఈ సందర్బంగా  నిశితంగా విశ్లేషణ చేశారు . బోస్టన్ గ్రూప్ నివేదికను  కోడ్ చేసిన   కేసీఆర్  ...  జూన్ వరకు  లాక్ డౌన్ ప్రకటించాలని బోస్టన్ గ్రూప్ సూచించిందని వెల్లడించారు . తెలంగాణ లో తబ్లీగి జమాత్ మతసమ్మేళనానికి హాజరయి వచ్చిన వారితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిన తరువాత కేసీఆర్ సర్కార్ ఒక్కసారిగా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది . ఏప్రిల్ 14 వతేదీన లాక్ డౌన్ ఎత్తివేస్తే కాంటాక్ట్ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముందని గ్రహించి   , లాక్ డౌన్ గడువు పొడిగించడం ఒక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చింది .

 

ఒక్క తెలంగాణ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని కేంద్రమే తీసుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది . ఒకవేళ కేంద్రం లాక్ డౌన్ సడలించిన తెలంగాణ సర్కార్ మాత్రం లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నాయని మీడియా సమావేశం ద్వారా  కేసీఆర్ ప్రజలకు స్పష్టమైన  సంకేతాలను ఇచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: