మందులేని కరోనా వైరస్ నీ ఎదుర్కోవాలంటే నియంత్రణ ఒక్కటే మార్గం అని కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలులోకి తీసుకువచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు లాక్ డౌన్ నీ చాలా కఠినతరం గా అమలు చేస్తున్నాయి. కారణం లేకుండా ప్రజలు ఎవరైనా ఇంటి నుండి రోడ్డు మీదకు వస్తే పోలీసులు ఓ రేంజ్ లో కోటింగ్ ఇస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పటికీ వైరల్. కేవలం ప్రభుత్వం విధించిన టైములో అది నిత్యావసర సరుకుల కోసం అదేవిధంగా కూరగాయల కోసం మాత్రమే ప్రజలను రోడ్డుపైకి నియమించిన సమయంలో రాణిస్తున్నారు. ఒకవేళ అర్జెంటు మరియు అత్యవసర పరిస్థితుల్లో అయితే పోలీసుల పర్మిషన్ తో ప్రజలు రోడ్డెక్కుతున్నారు.

 

ఈ టైంలో బంజారాహిల్స్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే ఓ యువతి హడావుడిగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది. లాక్ డౌన్ కారణంగా తన బాయ్ ఫ్రెండ్ ని చూడలేకపోతున్నాను అని తన దగ్గరికి నన్ను పంపించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరింది. ఆ కోరిక విని పోలీసులంతా షాక్ అయ్యారు. ఇంత లాక్ డౌన్ వేళ ఇదేం కోరిక అని ముక్కున వేలేసుకున్నారు. తనను వెళ్లనిచ్చేదాకి పోలీస్ స్టేషన్ వదలనని స్టేషన్ లో భైటాయించింది. అయితే ఆమె ప్రేమిస్తున్న యువకుడు అంబర్ పేట కు చెందిన వాడు.

 

గతంలోనే యువతి ఇంటికి వచ్చిన టైములో స్థానికులు మరియు తల్లిదండ్రులు...సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే యువతి కోరిక మేరకు పోలీసులు యువకుడిని పిలిపించగా.. యువతి మీద తనకు ఎలాంటి ప్రేమ లేదని.. అది చెప్పడానికే వచ్చానని తెలిపి కేసు నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఈ తతంగం మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది నెటిజన్లు వీళ్ళ ఓవర్ యాక్షన్ కరోనా కంటే ఎక్కువ చిరాకు తెప్పిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: